కవిత రచన : సాత్విక
శూన్యమా ఓ శూన్యమా,
నీవు విశ్వంలో అనంతమా,
నీ విశాల రూపమే ఆకాశమా,
అనంతకోటి వింతల సంగమమా,
కనిపించని కాలంతో నీకు సావాసమా,
ఉండీ లేదనిపించుకునే మాయాజాలమా,
కలలో సైతం నీ ఎల్లలు ఊహించ తరమా,
సుసంపన్నమైన తారాకోటికి నీవే ఆవాసమా,
ఆది - అంతం అన్నీ నీవే అన్నది అప్రస్తుతమా,
ప్రకృతి సంధించే ప్రతి ప్రశ్నకి నీవే ఇక సమాధానమా,
నా ప్రియురాలు అంటే నీకు కూడా అంతటి అభిమానమా,
ఎల్లప్పుడూ తన చెంత చేరక ఒకింత తనంటేనే నీకంత కనికరమా,
గ్రహపాటుగా తన మనస్సుని నేను నొప్పిస్తే నువ్వే నాకు బహుమానమా,
నిన్ను ప్రసాదించుటే 'తనూ నన్ను ప్రేమించింది' అనుటకు ప్రత్యక్ష సాక్ష్యమా,
నిన్నే బహుమానంగా పొందుటే, 'నేనూ ప్రేమించాను' అనటానికి నిదర్శనమా !
నీవు తలవంచేది కేవలం మా ఇద్దరిలోని అనురాగ ఆప్యాయతలకి మాత్రమా !!
శూన్యమా ఓ శూన్యమా --- శూన్యమా ఓ శూన్యమా --- శూన్యమా ఓ శూన్యమా * * *
nice..-:) చాలా బాగా రాశారు....
ReplyDeleteథాంక్స్..
Deleteచాలా బాగుందండి. ఈరోజు ఏ విషయం మీద కవిత పెట్టి ఉంటారు అనుకుంటూ మీ బ్లొగ్ చూస్తాను. Your topics selection is Amazing. 'అన్నిటికి మూలం శూన్యమే, అన్నిటిలో అంతం శూన్యమే, బాధ బహుమానమూ శూన్యమే' -- nice thought. Nice Pic too, నాకు బాగా నచ్చింది
ReplyDeleteఅంతా శూన్యమే అని అనిపించి ఇలా ....
Deleteథాంక్స్ అండీ
మీ బ్లాగ్ తెరిచి ఒక్క క్షణం ఉల్లిక్కి పడ్డాను .
ReplyDeleteఇలాంటి తపాలు,చిత్రాలు పద్మార్పిత గారికి సొంతం.
మరి ఇదేంటా అనుకుంటూనే చదివాను మీ కవిత.
మిమ్మల్ని "శూన్యం" మీద కూడా కవిత అల్లేసినందుకు మెచ్చుకోకుండా ఉండలేను.
చిత్రం కూడా... బాగుంది.
శూన్యము అని వెళ్ళిపోకుండా మీ సంతకం పెట్టినందుకు ధన్యవాదములు....
Deletesuper ,chala baaga raasavu.....
ReplyDeleteThanks spandana ....
DeleteExcellently written!! very good conept and feel :)
ReplyDeleteThanks for enjoying the feel.....
Delete