April 7, 2013

ఎంజాయ్ అండ్ దెన్ బ్రేక్...


కవిత రచన : సాత్విక

మాయ అనే కొలనులో నీవున్నావు,
వాస్తవం అనే సమాధిలో నేనున్నాను,
నీకెలా వినిపిస్తుంది నా మానసిక ఆక్రందన,
నాకెలా అర్ధమవుతుంది నీ ఆ  ప్రేలాపన,

నీ ఎడబాటే నిలిచేను నాలుగు గోడలై సరిహద్దులుగా,
నా తడబాటే నీకు అనిపించేను ముద్దు మురిపెంగా,
నా ఈ అచేతనావస్థ చూడలేవు నా కన్నులు సైతం నన్నే జాలిగా,
నీకు మాత్రము అగుపించెను ఒక అందమైన గోపుర ప్రాకారంగా,

మాయా పొరలు వేగిరంగా కమ్ముకుంటున్నాయి నీ తట్టు,
వాస్తవ ఉచ్చు పట్టు బిగిసి పోతోంది నెమ్మదిగా నా చుట్టూ,
మాయలోని నీకు వాస్తవము కనపడుట సాధ్యమగునా ?
వాస్తవాన్ని మాయకు వివరించి చెప్పుట నా తరమగునా !

ప్రతి ఒక్క జంటకి ఎదురగును మన ఈ పరిస్థితి,
నిబ్బరముగా తోడు నెరిగి ముందుకు నడిపేదే మౌనస్థితి,
మౌనం మౌనం మౌనం అదే నాకూ, నీకూ ఇప్పటికి ప్రాణం,
అందుకే నేను ప్రక్కకి తప్పుకొని చేస్తున్నా ఈ అర్ధాంగీకార స్తుతి !!

గమనిక : 'అర్ధాంగి స్తుతి' ఎంత లాభమో 'అర్ధాంగీకార స్తుతి' కూడా అంతే బలం చేకూరుస్తుంది.. కాకపోతే సమయానుకూలంగా అడుగులు వేయాలి అంతే !!

Maintain the silence only if needed,
Break the silence only if required...
                                                    ...Saatvika !!

10 comments:

  1. Mounam lo nunche enno alochanalu puttukuvasthayi... and I think nee mounam lonche puttuku vachinadhi ee kavitha. .. Is it ?

    11th and 2th lines chala chala bagunnai ..

    And final touch of u ardhangikara stuthi and ardhangi stuthi inka bagundi !!!

    ReplyDelete
    Replies
    1. better not to reveal how it is ? ;-)

      Thanks for enjoying the poem in and out....

      ha ha ha ...

      Delete
  2. " ఎంతవారలైనా కాంతా దాసులే " అన్న నానుడి ఙ్నప్తికి వచ్చింది . బాగుంది.

    ReplyDelete
    Replies
    1. కొంచం వ్యతిరేకముగా వున్నా కూడా లాభమే అని చెప్పదలచినదే ఇది ...
      Thanks.

      Delete
  3. Anonymous4/07/2013

    Don't maintain silence with better half, dangerous :) open ur mind be rebuked u will be happy :)

    ReplyDelete
    Replies
    1. Maintain the silence only if needed,
      Break the silence only if required...

      అది బెటర్ అనిపించింది .... కాదంటారా ? ;-)

      Delete
  4. good one ..manchi feel undi nee kavitalo

    ReplyDelete
    Replies
    1. Good feel generated with your comment as well... ha ha ha ...
      Thanks spandana...

      Delete
  5. I liked the last 2 lines very much!!

    ReplyDelete
    Replies
    1. Intelligent !!
      పిప్పి ని వదిలేసి సారం బాగుందంటావా ?

      Thanks...

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు