గీత రచన : గుంటూరి
సాయం సమయం విహరించొద్దంటే …… కస్సు బస్సు,
జత కోరి ఆపై విచారించొద్దంటే …… వినదు కదా ఈ మనస్సు,
ఓ మనసా,
అటు చూడకు ఇటు చూడకు,
అసలేటూ చూడకు ………
అందాన్ని అసలే పట్టించుకోకు,
కుర్ర మాటలు నువ్వస్సలు వినిపించుకోకు,
విడమరచి జాగ్రత్తలు చెబుతుంటే వింతనుకోకు,
ఓ మనసా,
ఈడు సునామి హోరుకి నువ్వంటే చాలా అలుసు,
యవ్వన వారధి దాటాల్సిన పరిస్థితి నీకేం తెలుసు,
నీది ఇప్పుడిప్పుడే మొగ్గలు తొడుగుతున్న పసి వయస్సు,
పాపం పసి మనస్సు …… అయ్యో! … పాపం పసి మనస్సు…
సాయం సమయం విహరించొద్దంటే …… కస్సు బస్సు,
జత కోరి ఆపై విచారించొద్దంటే …… వినదు కదా ఈ మనస్సు,
ఎటు వెళ్ళునో ఈ మనస్సు,
ఎవరి జత చేరునో నాకేం తెలుసు,
ఓ మనసా,
పార్కులలో కొన్ని,
బస్టాపులలో కొన్ని
కాలేజీలలో అన్నీ,
ఆ పై చెప్పిన వేవీ లేని విల్లెజ్లలో మరిన్ని,
జరిగుతున్న మనస్సు యాక్సిడేంట్లు ఎన్నో…
ICU లో ఉంచి చికిత్స చేయాల్సిన గాయాలు ఎన్నెన్నో…
ఓ మనసా,
శారిరిక బలాత్కారాల న్యాయానికే అధోగతి,
మానసిక బలాత్కారాల మాటే లేని సామాజిక స్థితి,
పెక్కు ధుఖ్కమ్ లో ఫక్కున నవ్వాల్సిందే నీ పరిస్థితి,
ఇప్పటికైనా అర్ధం చేసుకొని, మార్చుకో నీ మానసిక స్థితి,
సాయం సమయం విహరించొద్దంటే …… కస్సు బస్సు,
జత కోరి ఆపై విచారించొద్దంటే …… వినదు కదా ఈ మనస్సు…
చాలా బావుంది...ఇంతకి తెలిసిందా మనసు ఎటు వెళ్లిందో..
ReplyDeleteఇంకా లేని 'మా' జీవితమా ! కుడా బావుంది....మీరిలాగే రాస్తుండాలని మనవి!
అగిసే అలలకి స్వాగతం ఈ బ్లాగ్ కి....
Deleteఆనందించి మెచ్చినందుకు ధన్యవాదములు .... ప్రయత్నిస్తుంటాను ...
ప్చ్... మనసు మాట వినదే!
ReplyDeleteమనసు మాట మనం వినకుండా ఉంటే పోలా ?.... :-)
Deleteబుద్దిగా మాట వింటే అది మనస్సు ఎందుకు అవుతుంది.. మనస్సు మన మాట విననప్పుడు,మనం మనస్సు మాట వింటే పోలా అంతా Happys
ReplyDeleteమనసు మాట వింటే మనం తప్పకుండా పోతామండి అదే నా భాదంతా .....హ హ హ ....
Deleteమనస్సు కూడా కోతి కదా !! అందుకే మరి......
ReplyDeleteమనస్సు కూడా మారుతేగా అనాలి .....
Deleteలేకపోతే కరిచే ప్రమాదముంది .... :-)