April 19, 2013

అయ్యో ఇది కనికట్టా !!

కవిత రచన : సాత్విక


సముద్రములోని 'అల ఎగిసేను' వొయ్యారాలు వోలికేట్టా !
ఇంతకీ ఎగిసిన 'అల అంచున చేపపిల్ల' ఉన్నట్టా - లేనట్టా!
అల అంచున ఊగుతున్న చేపపిల్లదే అదృష్టమని బోగట్టా, 
చెట్టా పట్టా లేసుకొని చెట్టెక్కెను కదా ఒక లకుముకి పిట్టా, 
చిటారు కొమ్మనుండి తీక్షణంగా చూస్తున్నది ఎందుకట్టా ?
దాని చూపు ఎగిసి పడే అల అంచులనే కాదా? ఎట్టెట్టా ?
ముక్కున వోడిసిపట్టి తీసెను 'చేపపిల్ల జీవితం నట్టేట',
విధి, చిత్రాతి విచిత్రంగుండును కదా! ఇది ఒకరికి చెప్పెట్టా?
ఇది ఎవ్వరికీ - ఎప్పటికీ అంతు పట్టని కాలం కనికట్టా !!


8 comments:

  1. Very Cute ట్ట ప్రయోగం --చాల బాగుంది. ఎలా రాస్తారట్టా?

    ReplyDelete
    Replies
    1. మీ రాస్తారట్టా ? చెబుతోందంటా ... :-)

      Delete
  2. Replies
    1. భలే చెప్పారు ...
      అమ్మా అప్పా తెలుగమ్మాయి :-)

      Delete
  3. బొమ్మా బాగుంది, నీ కవితా బాగుంది,, కీప్ ఇట్ అప్ !!!

    ReplyDelete
    Replies
    1. నీ కామెంట్ కూడా బాగుంది ... keep it up...
      హ హ హ హ ..... :-)

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు