April 3, 2013

ఎవ్వరు ఏమనుకున్నా...


కవిత రచన : సాత్విక


ఎవ్వరు ఏమనుకున్నా ...
నేను నువ్వై జీవిస్తున్నా !

సరిగా తయారే కాలేకున్నా,
అద్దములోనా నిన్నే చూస్తున్నా,
అందరినీ చూసి నవ్వేస్తున్నా,
వారిలోనా నిన్నే గుర్తిస్తున్నా!

గమ్యానికి చేరుకోలేకున్నా,
రహదారి పొడవునా నిన్నే కన్నా,
నువ్వే నా ప్రకనున్నావనుకున్నా,
చిన్నపిల్లలా చిందులువేసేస్తున్నా!

వానచుక్కని వారించలేకున్నా,  
నువ్వేననుకొని పొరబడుతున్నా,
చందమామని చూడలేకున్నా,
నీలాగున్నాడని సిగ్గుతో తల తిప్పుకున్నా!

ఎందుకో ? 
నా గుండె సవ్వడి నేనే వినేస్తున్నా,
అది నీ పేరే జపిస్తుంటే మురిసిపోతున్నా, 
నా మనస్సు నాతోనే మారాం చేస్తున్నా,
అంతలోనే అది నీదని గుర్తొచ్చి మెదలకున్నా! 

ఎవ్వరు ఏమనుకున్నా,
నేను నువ్వై జీవిస్తున్నా!

19 comments:

  1. ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి ముందు ఎలా ఫీల్ ఔథున్దొ సరిగ్గా అలాగే రాసావ్!! nice one!!

    ReplyDelete
    Replies
    1. "పెళ్ళికి ముందు ఫీల్ అయిన ఆ అమ్మాయి పెళ్లి తరవాత ఎందుకు ఫీల్ అవ్వదు" అని చాలా మంది ఫీల్ అవుతున్నారు .... హ హ హ...(kidding)

      Thanks for enjoying the script..

      Delete
  2. Amazing సాగర్ గారు..అంతలా ప్రేమించబడే ఆ 'నువ్వు'ది ఎంత అదృష్టమో. Too good and cute.

    ReplyDelete
    Replies
    1. ప్రతి జంటలలో ఒకరికొకరికి ఇద్దురూ 'నువ్వు' లే కాకపోతే కాలమనే రహదారిలో యాంత్రిక వాహన ప్రయాణం వారి "నువ్వు "లే నీళ్ళతో వదిలేది "నువ్వులే' .....హ హ హ ....
      ఫ్లో లో రాసేసా లైట్ తీసుకోండి....

      Thanks for your encouragement.

      Delete
    2. 

      Delete
    3. నాకు ఈ భాష రాదుగా !! కాకపోతే తిట్టారని మటుకు అర్ధం అయింది ;-)
      హ హ హ !!

      Delete
    4. తిట్టలేదండి, light తీసుకున్న

      Delete
  3. chala chala bagudhi... fresh ga undhi ee kavitha..

    kakapothey ammai laga feel ayyi ela rasava ani doubt ??

    ReplyDelete
    Replies
    1. వాస్తవ ఊహలల కల్పనావర్ణనే కవిత్వము,
      వాస్తవానికి దగ్గరగా పోల్చగలిగితే అద్భుత కల్పన అవుతుంది,
      లేకుంటే అది అభూత కల్పన అవుతుంది .....

      ఇది కూడా ఫ్లో లో రాసేసా , లైట్ తీసుకో...

      Thanks.

      Delete
  4. " ఆ ముఖ కవళికలు ఆ యమ మనోభావాలు కవిత చాలా అందంగా ఉన్నాయి."

    ReplyDelete
    Replies
    1. పొందికయిన పాప , అందమయిన భావం
      అని టైటిల్ ఎడితే పోలా ?
      ధన్యవాదములు !!

      Delete
  5. chala baga raasavu... ammayi photo chusaka raasava or raasaka ammayi photo pettava?

    ReplyDelete
    Replies
    1. నన్ను అందరు అడిగిన ప్రసన ఇదే .... హ హ హ ....

      భావ వ్యక్తీకరణ తరువాత చిత్రము సమకూర్చితిని ....

      Thanks.

      Delete
  6. chaalaa baavundannaiyya kavitha

    ReplyDelete
  7. Anonymous4/04/2013

    హృద్యంగా ఉంది! -- Kamal Kishore Suruguchi

    ReplyDelete
    Replies
    1. వినసొంపైన వాక్యం.
      ఆస్వాదిన్చినందుకు నెనర్లు !

      Delete
  8. ఈ సారి చిత్రాన్ని x-large సైజ్లో పెట్టకండి.
    large సైజ్ అయితే కవితను డామినేట్ చెయ్యదు.(మీకు తెలియదని కాదు, నాకనిపించింది చెప్పా, అంతే!)
    అమ్మాయి లా భలే రాసారే!

    ReplyDelete
    Replies
    1. అంటే అమ్మాయిలు మాత్రమే భలే రాస్తారా ? హ హ .... kidding..

      ధన్యవాదములు..

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు