April 10, 2013

ఎందుకో? అసలెందుకో ? ఇలా కాకున్నదెందుకో? ....


గీత రచన : గుంటూరి

ఎందుకో? ఇది ఎందుకో ?
ఆమని లోని ఆనందం ..... నే ఆస్వాదించలెకున్నానెందుకో ?
యామిని లోని చల్లదనం ... నా చెంత చేరలేకున్నదెందుకో ?

ప్రేమిస్తున్నావని నేననుకొన్నాను,
'ప్రేమ'నే మించావని తెలియదా ప్రియతమా,
ప్రేమకు ఆవల వున్నది ద్వేషమేనని తెలియదనుట... నీకు భావ్యమా ?

మనమేసిన  ప్రతి అడుగూ  కాలచక్రం మిగల్చిన జ్ఞాపకాలా ?
పంచుకున్న ప్రతి నిమిషం అవిశ్వాస తీర్మానపు గురుతులా ?    
శ్వాసించిన ప్రతి ఘడియా విధి విదిల్చిన విష జ్వాలలా ?
నడయాడిన ప్రతి చోటు ప్రకృతి నిర్దేశించిన వికృత వలయాలా ?

ఎందుకో? ఇది ఎందుకో ?
ఆమని లోని ఆనందం ..... నే ఆస్వాదించలెకున్నానెందుకో ?
యామిని లోని చల్లదనం ... నా చెంత చేరలేకున్నదెందుకో ?

కాలగమనం చేసేను మందహాసం...
అనుకొన్నాను అది అపార్ధం చేసిన చిరు దరహాసమని,
కానీ తెలుసుకోలేకపోయాను విధి చేసిన వికటాట్టహాసం అని నీకు తెలుసునా ?

'ముల్లుని ముల్లుతోనే జయించాలన్న సత్యం'  ద్వేషం ఎడల నిజం కాదులే...
నే కలత చెందినా, ఈ నిజమెరిగిన  నా మనస్సు నిన్నే దూషించదులే...
ఎడబాటు అన్న పదాన్ని తడబాటుగా కూడా ఉచ్ఛరించజాలనులే ...
వెలుగు తాకిడి ముంగిట ఏ పొగమంచైనా అస్సలు నిలువజాలదులే ... !!

ఎందుకో? ఇది ఎందుకో ?
ఎందుకో? అసలెందుకో ?

అపార్ధాల ఆవల ఉన్న 'అర్ధం' నాతో  చెప్పెను నిరీక్షించమని... 
నేనిచటనే వేచి యున్నా నీకోసం ...
చేరుకో నన్ను త్వరితగతిన ....

ఎందుకో? ఇలా కాకున్నదెందుకో ?
ఆమని లోని ఆనందం ..... ఆస్వాదించాలన్నది నా పంతం ...
యామిని లోని చల్లదనం ... ఆనందించాలి మనమిద్దరమూ  ఆసాంతం ....

ఎందుకో? అసలెందుకో  ? ఇలా కాకున్నదెందుకో ?....

10 comments:

  1. Anonymous4/10/2013

    Nice,

    But once it is available, it wont be that sweet.

    ReplyDelete
    Replies
    1. Thanks for leaving the footprints, but identity is missing.

      Delete
  2. ఎందుకో ఇంత అవేదన ఎందుకో?
    అపార్ధాలు కలకాలం ఉండునా?
    ప్రేమ జయించును తప్పక!

    ReplyDelete
    Replies
    1. హ హ హ !!
      ధన్యవాదములు !!

      Delete
  3. తప్పక అవుతుంది....ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. స్వాగతం!
      మీకునూ శుభాకాంక్షలు !
      ధన్యవాదములు !!

      Delete
  4. Anonymous4/10/2013

    మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభకామనలు

    ReplyDelete
    Replies
    1. మీకునూ, మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !
      ధన్యవాదములు !!

      Delete
  5. WHmm!! very nice!! I really can't believe that u r writing all this!! What a feel...

    ReplyDelete
    Replies
    1. why this kolaveri ? why this kolaveri ?
      why can't you believe ? hu hu hu !!

      thanks for appreciations in the form of shocking expression.....you are good in this mode of expressions...

      :-)

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు