April 11, 2013

లేని 'మా' జీవితమా !!

కవిత రచన : సాత్విక 
స్వేచ్చే లేని స్వాతంత్రమా,
మోసం లేని కుతంత్రమా,
ప్రత్యర్దే లేని సమరమా,
సమర్ధించ లేని నిజమా,
అర్ధం లేని సూత్రమా,
నటించ లేని నాటకమా,
ప్రేరణ లేని పయనమా,
ఉండీ లేని ఆంతర్యమా,
ఊహించ లేని కారణమా,
ఆదాయమే లేని వ్యాపారమా,
గమ్యమే లేని ప్రయాణమా,
గతంలోకిపో లేని వాస్తవమా,
భవిష్యత్తెరుగ లేని స్వగతమా,
నియంత్రించ లేని ప్రారబ్ధమా ,
వితవ్యమే లేని సమాప్తమా,
ఇన్ని లేకున్నా నువ్వే  అసమానమా !

రూపం లేని ఓ జీవితమా !
నేనునూ నీ భ్యర్ధినే సుమా !!

8 comments:

  1. Replies
    1. Good that its Good one....

      మీరు కూడా రెండు కొత్త లైన్స్ జోడించండి కవితకి .....
      మరీ పొదుపుగా వాడుతున్నారు మాటలని ....హ హ ... :-)

      Delete
  2. Replies
    1. చాన్నాళ్ళకి వచ్చారు మీరు ....
      ధన్యవాదములు ......

      Delete
  3. జీవితానికి రూపం లేదంటే ఎందుకో నేను ఒప్పుకోను. :)
    మీ రాసిన లైనెస్ అన్నీ ఆకట్టుకున్నాయి. బాగుంది సాగర్ గారు.

    ReplyDelete
    Replies
    1. మీరు ఒప్పకుంటే నేను కూడా తప్పకుంటే మాత్రమే ఒప్పుకుంటా ......
      మీ ఉగాది సంబరాలు పూర్తి అయ్యాయా.....
      హ హ .....thanks అండి!!

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు