April 4, 2013

ఇంతేలే నీ యవ్వారం...


కవిత రచన : సాత్విక


లేతప్రాయంలొ నీ కోసం నే పరితపించిన వైనాలు,
అమితమైనవి నాకు ఈ ప్రాయమునా అవే పోకడలు,
'ఋతువుల పొడవు'గ సాగేను నా ఈ ఎదురు చూపులు,
తామరాకు పై నీటిచుక్క చందమాయే నీ పలకరింపులు,

నీ దరిచేరు క్షణం కలిగించును అందమైన అనుభూతి,
ఆసాంతము ఆస్వాదించాలన్నది ఎప్పటికీ తీరని నా అత్తి,
ఎన్నిమార్లు చవి చూచినా తగ్గట్లేదు కదా నీ పై నా ఆసక్తి,
ఇప్పటిదా? అప్పటిదా? మరెప్పటిదోలే మన ఈ అనురక్తి, 

ఆహ్వానించకనే వచ్చి, అలక తీర్చి సేద తీరమంటావు,
నా అనుమతి లేకున్నా నడిరేయి చల్లంగా జారుకుంటావు,
వేకువనే నీ చాటుతో ఒంటరియైన నన్ను అదను చూసి, 
నీ మొదటి తోటికోడలు నిదురలేపును కదా మాటు వేసి,

ప్రతిసారీ నువ్వు వీడిపోయే ఆ ఉత్కంఠ క్షణాలు,
వెల్లువై పారెను మదిలో నీవు మిగల్చిన జ్ఞాపకాలు,
వీడకుండెను తనువంతా నిండిన బద్దకపు సరాగాలు,
మళ్లీ మొదలు నీకై 'ఋతువుల పొడవు'గా నా ఎదురుచూపులు,
ఆది నుంచి ఇంతేలే నీ యవ్వారం, అందుకే ఐనావు -- "ఆదివారం" !!

ఋతువుల పొడవు = ఆరు (అనగా ఆరు రోజులు అని చెప్పాలని నా బాధ ...) 

14 comments:

  1. kavitha chaduvuthune edho suspect chesa.. ekkado twist untundhani....

    modati todikodalu anna padam daggara kinda chadavakunda decode cheddamani try chesa kani mm no way... inka undabattaleka next 4 lines skip cehsi ending chusesa....

    and ammo evvari oohalaki andani context pickup cehsi danni entha variety ga present chesavu...

    Hats Off !!

    ReplyDelete
    Replies
    1. your description gave me the feel that I am looking at you when you reading this.... ;-)

      Thanks for the encouragement and inspiration !!

      Delete
  2. భలే! కాదేదీ కవితకనర్హం అన్నట్టు...
    ఆదివారం చిక్కింది మీ చేతికి ఈ పట్టు!

    ReplyDelete
    Replies
    1. మీరు భలే భలే అంటుంటే ఆ మాటతోటి ఏదో రాయాలి అనిపిస్తుంది :-)

      ధన్యవాదములు వెన్నెల గారు !!

      Delete
  3. That's y I love SUNDAY :-)

    ReplyDelete
    Replies
    1. but software field pulled out the charm of sunday and gave it to Friday evening... pch pch

      of-course still we all loves Sunday as usual as every other near and dears are good enough to access on that day...

      :-) :-) :-) Thanks Padmarpita gaaru !!

      Delete
  4. ఆదివారం గురించి చక్కగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. Yohanth welcome to my blog!

      అసలు ఆదివారానికి మనవారం అని పేరు మార్చాలని నా strong ఫీలింగ్!!
      హ హ హ !!

      Thanks.

      Delete
  5. విశ్రాంతితో ఆరంభమయ్యే ఆదివారం మీద అందరికీ అమితమైన మోజుంటుందన్నది అక్షరసత్యం. ఆనందహ

    ReplyDelete
    Replies
    1. మీ ఆనందమే మాకు ఆనందోబ్రహ్మః !!

      థాంక్స్!!

      Delete
  6. భలే రాసారు.ఏమి రాసారో కవితలోఅని ఆత్రంగా చదవటం మొదలు పెడితే చివరకు ఒక పెద్ద smile,
    మీ subject చూసి. Simple and too good. Nice Pic too

    ReplyDelete
    Replies
    1. మీ smile కోసమే ఈ ప్రయత్నం. అంటే ఏదో కొద్దిగా సఫలీకృతం అయినట్టే మరి... :-)

      pic విషయంలో మీ observation కి థాంక్స్.
      general గా పట్టించుకోరు, కానీ దానిలోనూ విషయం ఉంది. గ్రహించిన మీకు మనస్పూర్తిగా ధన్యవాదములు.

      Delete
  7. haha!! very nice!!

    ReplyDelete
    Replies
    1. ఎంత సండే మీద కవిత రాస్తే మటుకు సండే మాత్రమె చదివుతావా ? ఆయ్ హమ్మా !!

      హ హ హ హ హ Thanks.

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు