April 9, 2013

ఎడబాటే ఎదురుగ ... తడబాటే తోడుగా..

గీత రచన : గుంటూరి

ఎడబాటే ఎదురుగ……….నే నిలచేను, ఈ క్షణం  
తడబాటే తోడుగా………..నువ్వై పిలచేను నన్ను, ఆ క్షణం,
మరుక్షణం .... నా నిరీక్షణం,
చేస్తున్నది నీ ఊహల చుట్టూ ప్రదక్షిణం
క్షణ క్షణం.... అనుక్షణం,
నువ్వే నేనుగా జీవించేస్తున్నా నీ క్షణం ... !!

నీడల్లే వెంటపడ్డ మౌనాన్ని ..
నిన్ను గుర్తే చేసి వేధించద్దని వేడుకొంటున్నా
నా మది ముంగిట నిలచిన ప్రతి తలంపుని....
ఆ మౌనంతోనే యుద్ధం చేసెయ్యమని పురమాయించేస్తున్నా ... !!

కంట పడ్డ జంటలనన్నిటినీ..  
మన ఇద్దరిగా నేనూహించేసుకుంటున్నా
నిలచిపోయిన ఈ కాలాన్ని....
ఆ జంటల చిలిపి చేష్టలతో జతే చేసి పరిగెత్తించేస్తున్నా ... !!   

ఎడబాటే ఎదురుగ……….నే నిలచేను, ఈ క్షణం  
తడబాటే తోడుగా………..నువ్వై పిలచేను నన్ను, ఆ క్షణం,

నువ్వే లేని ఈ క్షణం .
నాకొద్దొద్దంటూనే నీ కోసమే నే జీవించేస్తున్నా
అలా నీచెంత నే లేకుండా....
అదే ఒంటరి క్షణం నీతోటే నేను పంచేసుకుంటున్నా ... !! 

ఎగిరొచ్చిన సీతాకోక చిలుకే ...
ఎగతాళిగా వెక్కిరించేస్తున్నదనుకుంటున్నా
తన ప్రియ సఖికై వెతుకులాట అని తెలిసి ....
చిరునామా నీదగ్గరున్నదని  నీ వద్దకే తనని పంపించేసా ... !!

ఎడబాటే ఎదురుగ……….నే నిలచేను, ఈ క్షణం  
తడబాటే తోడుగా………..నువ్వై పిలచేను నన్ను, ఆ క్షణం,
మరుక్షణం .... నా నిరీక్షణం,
చేస్తున్నది నీ ఊహల చుట్టూ ప్రదక్షిణం
క్షణ క్షణం.... అనుక్షణం,
నువ్వే నేనుగా జీవించేస్తున్నా నీ క్షణం ... !!

8 comments:

  1. అద్భుతం! అత్యద్భుతం !!

    ఒంటరిగా ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ని చాలా బాగా చెప్పావు ..

    తోడు దగ్గర లేనప్పుడు... ప్రతి క్షణాన్ని గడపలేనంటూనే ... మళ్ళి తన తలపులతో ఉంటూ వావ్ .. సూపర్ ....

    కంట పడ్డ జంటలన్నిటిని .... ఈ 4 లైన్స్ చాలా realistic గా మనసైన వాళ్ళు దగ్గర లేనప్పుడు వేరే వాళ్ళని చూస్తే కలిగే భావాలన్నీ చాలా చక్కగా చెప్పావు.

    క్షణ క్షణం.... అనుక్షణం, నువ్వే నేనుగా జీవించేస్తున్నా
    'ఈ క్షణం' అని రాయకుండా 'నీ క్షణం' అన్న చోట ఈ పాట highlight దాగుంది..!!

    ReplyDelete
    Replies
    1. మొత్తంగా ఆస్వాదిన్చినందుకు ....థాంక్స్

      Delete
  2. In one line " Tripura is a lucky girl"

    ReplyDelete
    Replies
    1. Welcome to the blog.

      I am not sure....!!

      Thanks.

      Delete
  3. Anonymous4/10/2013

    wonderful presentation......

    ReplyDelete
    Replies
    1. Thanks for leaving the footprints, but identity is missing.

      Delete
  4. నువ్వు ప్రస్తుతం ఇలాగే ఫీల్ ఔతున్నవా? ఒక నెల లో ఇలాంటి ఫీలింగ్స్ అన్ని ఉండవు లే :) ఇది ఎందుకో నువ్వు మీ ఇద్దరి గురించి రాసావని అనిపించింది. చాలా చాలా బావుంది ...త్రిపుర ని నువ్వు బాగా మిస్ అవుతున్నవని అర్థమైంది!!!

    ReplyDelete
    Replies
    1. ఆస్వాదించినందుకు థాంక్స్.

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు