April 27, 2013

నా చెలి అలక,విరుపు ఆ పై వాలుచూపు ..

కవిత రచన : సాత్విక 


'అలుకఎరుగని ఆ కాలానికి అంతు చిక్కనిది అలుక సోగసు,
'చినదాని అలుకలోని అందం' కేవలం మగాడికి మాత్రమే తెలుసు,
అది ఒకింత తక్కువైతే, ఆమె తప్పక అవుతుంది అతడికి అలుసు,
మరీ ఎక్కువైతే, అది అయిపోతుంది వారిద్దరికీ కంట్లో నలుసు ...
'అలక లేని ఆడది ట్విస్ట్ లేని సినిమా' అన్నది మగడి మనస్సు

అరుపు తప్ప ఆలోచనే లేని ఆవేశానికి అర్ధం కానిదే విరుపు,
మూతి ముడుపులోనుంచే ఎక్కిస్తుంది 'చినదాని బుగ్గ ఎరుపు',
చినదాని మనసైనవాడిని, ఆ ఎరుపు ఖచ్చితముగా కుదుపు,
యాంత్రికమైన వారి పయనాన్ని ఇది సరదాలబాటలో నిలుపు,
ఇదే జంటల జీవన సాంగత్యంలోని అందమైన ప్రకృతి కూర్పు ...

జాలు వారే ముంగురులకి తెలియదు వెనుక దాగివున్న ఆమె వాలుచూపు,
ఇలాంటి చూపులలో వయస్సు చిలిపితనానికి లేకుండును అడ్డూ అదుపు,
దానిలోని కవ్వింతకు లొంగిన మగమనస్సులు కోటానుకోట్లకు పైచిలుకు,
ఈ అనుభూతిని చవిచూసిన అవి లేకుండా పడి వున్నాయి ఉలుకు పలుకు ..
ఇటువంటి గారడీ విద్య  'కానరాని ఆ వాలు చూపుకి'... ఆహా! ఎవ్వరు నేర్పు ?

7 comments:

  1. nijamgaaaa... mee cheli vaaluchopu baagaa varninchaaru..-:)

    ReplyDelete
    Replies
    1. భాదలో వర్ణన బాగుంటుంది అదే బాధలోని గొప్పదనం

      Delete
  2. Very Nice presentation. చాల బాగుంది

    ReplyDelete
    Replies
    1. హలో వెన్నెల గారు... బాగున్నారా ? ధన్యవాదములు ... :)

      Delete
  3. :( కానందుకు నాకు కూడా :)

    ReplyDelete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు