కవిత రచన : సాత్విక
(.. రెండవ భాగము ..)
నేనూ బాల్కనీలో నుంచొని ఉన్నప్పుడూ....
ఎదురింటి మేడ మీదకి వచ్చిందో మిస్సు, ఆమె చేసింది అమెరికాలో యెమ్.ఎస్సు,
చెయ్యి ఊపాను గుర్తొచ్చి నా హ్యాపీ డేసు, ఆ బుల్లి నా మీద ఆడింది కస్సు బుస్సు,
ఇంట్లో అందరిచేత ఇప్పించేసింది డోసు, నాకు తప్పలేదు కదా హెయిర్ లాసు,
విరక్తితో, అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , ఆరవసారి.
వీధి చివరున్న దవాఖానా యజమాని, అన్నాడు 'నీకు నేను లేనా' అని,
నన్ను లోపలికి పిలచాడు చెయ్యి ఊపి, పరీక్షించాడు నా గుండెను ఆపి,
తినిపించేసాడు వాడి దగ్గరున్న గోలీలు, కొట్టిన్చేసాడు అన్ని రకాల పల్టీలు,
జ్వరానికి వణుకు తోడై, అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , ఏడవసారి.
నేనూ ట్రాఫిక్ లో సిగ్నల్ కోసం వేచి వున్నప్పుడూ....
టెలి కాలర్ చేసింది నా మొబైల్ కి ఫోను, నాకోద్దోద్దు అంటున్న అప్పనంగా ఇస్తానంది లోను,
మా ఆవిడ కావాలంది ఏ.సి కూలర్ ఫ్యాను, పెంచేసింది మా ఇంటి ఖర్చులు పోను పోను,
ఇలా అయితే కరెంటు బిల్ పరిస్థితేమి గాను, అప్పుడు వచ్చేసింది సమ్మర్ పవర్ కట్ ప్లాను,
ఆనందంతో, అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , ఎనిమిదోసారి.
నేనూ సినిమాకి వెళ్దామని ....
బయలుదేరి వెళ్ళిపోయాను అమీర్ పేట్, లైన్లో నుంచొని మరీ పట్టాను కపుల్ సీట్,
హడావుడి లో పోగేట్టేసాను మా ఆవిడ లాకెట్, మిస్టేక్ కి అయ్యాను బోలెడంత రిగ్రేట్,
ధియేటర్ ముందు పరిచేసింది బ్లాంకెట్, చేయ్యమంది నన్ను కొత్తలాకెట్ కి మనీ కలెక్ట్.
నిస్తేజంతో , అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , తోమ్మిదోసారి.
నేనూ బైక్ మీద వెళుతున్నప్పుడూ....
ఎదురోచ్చాడొక పోలీస్ కానిస్టేబుల్, చూడగానే బండికి కలిగెను ట్రాబుల్,
చూపించాను పొల్యూషన్తో సహా నిల్, కానీ నా అదృష్ట దేవత ఎక్కేసింది హిల్,
అందుకే సరిగ్గా లేదన్నాడు బండికి లేబుల్, నా చేతిలో పెట్టాడు అయిదొందలు బిల్,
చికాకుతో , అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , పదోసారి.
మీ పోస్ట్ బావుంది... ధన్యవాదాలు...
ReplyDeleteమే పిల్లి తో తిట్టిస్తున్నారు నన్ను...ఏంటి ?? :)
తరుణ్ ప్రీతమ్
http://techwaves4u.blogspot.in (తెలుగు లో టెక్నికల్ బ్లాగ్)
వెల్కమ్ తరుణ్.
Deleteపిల్లి తిట్టినట్టు కనపడి అపనిందని మోస్తూ నవ్విస్తుంది ....పాపం..
థాంక్స్ ఫర్ యువర్ విషెస్ ..
I hope that cat is reciting the "Kavitha"!! Haha :) funny..
ReplyDeleteyes, its cross checking with everyone.
DeleteThanks for bearing .... sorry reading... ha ha ha
mee bloggadimpu blogundi huma rasamga sarasamga pakkana pilli kooda vanta paadinatluga saradasaradaaga undi!
ReplyDeleteసూర్య ప్రకాష్ గారికి స్వాగతం.
Deleteబ్లాగాడించటానికి మునుముందు కూడా ప్రయత్నిస్తాను ......
మీ అభినందనలకి ధన్యవాదములు ...
miss, ms, kassu bussu, hair loss balega undi :)
ReplyDelete