March 4, 2013

చి'లిపి' ప్రయత్నం !!

కవిత రచన : సాత్విక  
పగలు రేయిల నడుమ సంధికి సాక్ష్యిగా నిలచిన సాయంత్రం,
సెగల సూరీడు వగల 'చందు'రుడు కక్ష మారే ఈ సమయాన,
జతకోరు మనస్సు జాతరచేసు వయస్సు,  కక్షబూనిన విషయాన,
యుద్ద నీతిని మరచి ఒకరికొకరు సాయం అందించుకున్న తరుణాన,
మౌనానికీ, మాటకీ వారధిగున్న 'అ','ఊ' లను మనస్సు ఆశ్రయించగా,
ఇరువురిలోన తలెత్తిన సిగ్గుమందారాలకు  వానమే తలదించుకున్న వైనాన,
సంధ్యా గాలులు సాక్ష్యమివ్వక చల్లగా జారుకొనెను ఆ వేళ,
'ఆ'సక్తి (శక్తి) కి,  వారి శక్తికి సాగిపోతున్నదీ నిరాయుధ పోరాటం,
వారిరువురిలో అస్సలు గెలుపెవరిదన్నది అసంధర్బపు ఆరాటం,
రాణించిన 'ఆ'సక్తి (శక్తి) గెలిచి  --   వారోడిన, 
మైమరచి వారోడి -- 'ఆ'సక్తి (శక్తి)ని  గెలిపించినా,
మరువజాలని ఈ పోరు లో  ఆసాంతం సుఖాంతమే... !!

2 comments:

  1. హాయ్,

    నీ చి"లిపి"ప్రయత్నం లో విషయంతో కూడిన వాస్తవముంది .
    కొంతమందికి చి"లిపి"ప్రయత్నం కదలనే కదలదు .
    ఇంకొంతమందిని చి"లిపి"ప్రయత్నం వదలనే వదలదు.
    మఱికొంతమందికి చి"లిపి"ప్రయత్నం తగలనే తగలదు .

    జతకోరు మనస్సు జాతరచేసు వయస్సు
    మౌనానికీ, మాటకీ వారధిగున్న 'అ','ఊ' లను మనస్సు ఆశ్రయించగా,
    వారిరువురిలో అస్సలు గెలుపెవరిదన్నది అసంధర్బపు ఆరాటం,
    మరువజాలని ఈ పోరు లో ఆసాంతం సుఖాంతమే... !!

    శర్మ జీ ఎస్

    ReplyDelete
    Replies
    1. అర్ధమయ్యే సరళిని అనుకరించానో లేదో అన్న మీమాంస నాకున్నది. మీ యొక్క కామెంట్ తో నా సందేహం పటాపంచలయ్యేట్టు చేసారు. మీకు మంగిడీలు మంగిడీలు !!

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు