కవిత రచన : సాత్విక
(వదలి
వెళ్ళిన ప్రియురాలి జ్ఞాపకాలు
తనని తాకిన క్షణాలు,
నిండు
పున్నమి గడిచినది ఇలా భిన్న
భావాలా మిళితముగా...)
నే చూసిన తొలి జ్వలితం,
ఆ చూపే కల్మష రహితం,
ఎప్పటికీ అది నా మది లోతుల్లో నిక్షిప్తం..
నా చెలి అధరం,
నా చెలి అధరం,
నే చవిచూసిన తొలి మధురం,
చేరుకోవాడానికి బహు దూరం,
స్వర్గ సుఖానికి అది ముఖద్వారం..
నా
చెలి స్వరం,
నే
ఆస్వాదించిన తొలి మాధుర్యం,
నిలచెను
ఆ మధురిమ నా నర నరం,
నర్తించెను లయబద్దముగా నిరంతరం..
వేధించిన ధూళినీ, స్పర్శించిన గాలినీ అడిగాను -- నువ్వెక్కడున్నావని?
గల
గల పారుతున్న నీటిని, జల
జల రాలిన పూలనీ అడిగాను -- నువ్వేమయినావని
?
కల్మషం
ఎరుగని పిట్టని, నిర్మలమయిన
మేఘాన్నీ అడిగాను -- నువ్వెలా
ఉన్నావని?
వెడలి
పోయావు
చెలి,
వెల
వెల బోయెను
నా
లోగిలి,
హు
!
చూసావా
వెన్నెల
జాబిలీ,
లోటు
భర్తీకి
నువ్వే
వచ్చావా
కదలి..
నీవు
లేని ఈ నిండు పున్నమి వెన్నెల,
మారిపొయెను
ప్రచండ అగ్నిజ్వాలలా,
ఒంటరితనం
వేదించి దహిస్తున్నది నన్నిలా,
ఎందుకిలా ?
నాకే
ఎందుకిలా ?
Very cute
ReplyDeleteస్వాగతం వెన్నెలా జి !!
Deleteఆస్వాదించి అభినందించినందుకు మీకు ధన్యవాదములు !!
హాయ్,
ReplyDeleteచాలా బాగుంది.
Thanks !!
DeleteGood one!!
ReplyDeleteThanks..
Delete