March 27, 2013

కోకు


కవిత రచన : సాత్విక


భాష లేని భావమెందు'కో',
భావం లేక భాష నిలువలేనందు'కు'..

ఆశ తోటి ఆరాటమెందు'కో',
ఆరాటం లేక ఆశ గెలవలేనందు'కు'..

గమ్యం తెలియని గమనమెందు'కో',
గమనం తోనే గమ్యం చేరుకునేటందు'కు'..

కల్పితాలకి వర్ణనలెందు'కో',
వర్ణనతోనే కల్పితాల అందం విడమరచేటందు'కు'..

స్పందన కరువయిన చోట సాహిత్యమెందు'కో',
సాహిత్యమున్నదే స్పందన కలిగించేటందు'కు'..


10 comments:

  1. కమెంట్ రాస్తేనే స్పందననుకోకు:-)

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారికి స్వాగతం !!

      అలా అంటున్నే ఒకే వాక్యంలోకి తెచ్చారుగా 'కోకు' ...

      Delete
  2. ప్రతి కో కి ఒక కు ఉంటే Nice. కు లేని కో లతోనే ఇబ్బంది..చాలా బాగుంది

    ReplyDelete
    Replies
    1. ఈ 'కో' లకి ఆ 'కు' లు బాగున్నాయి....
      కానీ అన్ని చోట్లా కాదెమో వెన్నెలా !!
      ఆనందించిన మీకు నెనర్లు!!

      Delete
  3. మగవాడికి 'కో" కు టు ఉంటే అందంగా కనపడ్తారు.
    అదే ఆడవారికైతే 'కో' కు క చేరితే మహ అందంగా ఉంటారు.
    నువ్వేమంటావ్ ?

    http://naalochanalaparampara.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. కోకు తాగుతున్నాను ప్రస్తుతానికి ఏమి అనలేను ... ;-)

      Delete
  4. I wish ur " Havaa" should continue even after going to Inida.... నీ ప్రతి ఒక్క కవిత లో జీవిత సత్యాలు ఇంక హాస్యం కలిసి ఉంటున్నాయి . that's the reason i am liking almost every "Samosa"!!

    ReplyDelete
    Replies
    1. Thanks ji.

      ఎవడో చదివిన బాధితుడు మా బాస్ కి విషయం చేరేసాడు, వాడు పని పని అంటూ చంపుతున్నాడు...ప్చ్ ప్చ్
      బహుశా త్వరలో ఈ జోరుకి బ్రేక్ పడే (temporary gaa by May/June లలో ) సూచనలు కనిపించుచున్నవి...ప్చ్ ప్చ్..

      Delete
  5. స్పందన కరువయిన చోట సాహిత్యమెందు'కో',
    సాహిత్యమున్నదే స్పందన కలిగించేటందు'కు'..

    బాగుందండీ... మీ కోకు ప్రయోగం... నైస్ పోస్ట్...

    ReplyDelete
    Replies
    1. శోభగారికి స్వాగతం.

      ఆస్వాదించినందుకు ;-) ధన్యవాదములు !!

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు