March 18, 2013

మా పిచ్చ కానే కాదు ...

కవిత రచన : సాత్విక

ఓ రోదసీ యాత్రికుడా,
అంతరిక్షమున ఏమున్నది పరిశోధించడానికి ?
ఆలి అంతరంగమును పరిశీలించ వీలు వెతకవోయి..
అనంత విశ్వాన్ని నింపుకునే వైశాల్యం కనిపించునోయి...

ఓ యోధుడా,
కదనరంగమున కదం తొక్కనేలా ?
బాల కోరిక కాదని, ఆమె ఎదుట నిలువగలవా ..
నిలచిన తెలిసిపోవునులే నీ అసలు దమ్మెంతో ఓ సిపాయి ...

ఓ నావికుడా,
సాగరగర్భమున శోధించి నీవు వెలికి తీసిన నిధులెన్నో ? కానీ
నీ తరమగునా, త్రవ్వి చూచుట ఆమె మది లోతుల్లోన !!
నిక్షిప్థముగున్న నిగూఢమైన అనంత సంపదలెన్నెన్నో ...

ఓ పర్వత అధిరోహకుడా,
పర్వత శిఖరము చేర మార్గమన్వేషించి మధన చెందనేలా ?
ఆమెలోని దూరాలోచనా శిఖరము చేర పధము వెతకవోయి ..
జీవితపు అసలు అంచు ఏమిటో నీకే అవగతమవునోయి ...

ఆమె మోసే కుటుంబ భారం ముందు భూమాత మోసే భూభారం తక్కువేనోయి..
పెను తుఫాను సైతం,  ప్రశాంతముగా యోచించును కదా ఒక్క క్షణం ఆమెని తలచినంతనే..
భగవంతుడే మారు రూపముగా అవతరించి, చేసుకొనెను కదా అమ్మ ఒడినే తన సన్నిధిగా ..
నీకు అతిశయోక్తి అనిపించేనా? ఆమెతో నీ సాన్నిహిత్యం పెంచుకొని మరల చూడ రావోయి ...

ఆమెను ...
నీవేరుగవులే, నేనెరుగనులే, అసలేవ్వరకి తెలియదులే,
ఆమెనెరుగ, కవి పండితులు కలం పట్టి చేస్తున్న కాలయగ్నమిది (కవిత్వం),
ఆమెనెరుగ, తరతరాలుగా సాగిపోతున్న నిరంతర పట్టుపటాంగమిది (దీక్ష),
ఆమెను ప్రకృతి తో పోల్చుట తప్పు(ప్పదు)లేదులే ఓ చిరంజీవి సోదరా ... 

ఇట్లు
వేడి వేడి సమోసాల బండితో,
బండి యజమాని సాత్విక..

(ఏదో మా పిచ్చ కాకపోతే , అమ్మాయికి ప్రకృతికి పోలికేంటి ?   అన్న ప్రవల్లికకి సంక్షిప్త సమాధానంగా ఇలా ...)

5 comments:

  1. Wow.. Amazing ఇలా ఆలోచించేవారు 1% ఉన్నా ఈప్రపంచంలో స్త్రీలు కేవలం కవితలు,కథల్లోనే కాక నిజజీవితంలోకూడా
    ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. Nice one

    ReplyDelete
  2. nice one, feel proud to be a woman

    ReplyDelete
  3. nice.......................

    ReplyDelete
  4. చాల బావుంది !! అమ్మాయిల గురించి ఇంత పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళున్నారా అనిపిస్తోంది!! :)

    ReplyDelete
  5. @వెన్నెల గారికి , @స్పందన కి , @నరేష్ గారికి, @విద్య కి : అభినందనలకి ధన్యవాదములు.

    మంచి చెడు అందరిలో వున్నట్టు 'ఆమె' లో కూడా 'మంచి-చెడు' రెండు ఉన్నమాట వాస్తవమే.

    కాకపోతే 'అతివ' ఒక ఉన్నతమయిన ధోరణితో ఉండి అందరికి ఆదర్శవంతముగా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ,
    అధిక శాతం అతివలలో మంచి వున్నదని 100% నమ్మి రాసిన కవిత ఇది.

    ReplyDelete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు