March 7, 2013

తూచ్..తూచ్........తూచ్ !!

కవిత రచన : సాత్విక 

అడగకనే స్ప్రశించావు ,
వలదన్నా వరించావు ,
పదే పదే పలకరించావు ,
నిలువరించినా నో అన్నావు ,
నీ కెందుకంత అభిమానం నేనంటే ...

నే తడిమితే కందిపోతావు, 
నే నిమిరితే వలదంటావు,
నే కలబడితే చెదరిపోతావు,
నీ కేందుకంత బెదురు నేనంటే ...

కసురుకున్నా  కదలలేదు,
విసురుకున్నా వదపోలేదు,
చీదరించుకున్నా చికాకుపడలేదు ,
నీ కెందుకంత ఓర్పు నా విషయంలో …

నీ గమనంతో , నన్ను ఉక్కిరిబిక్కిరి చేసావు,
నీ కవ్వింతలతో , అనుక్షణం ఉడికించావు,
నా తనువంతా , ఆణువణువూ పయనించావు,
ఈ తమకంతో, నేను నీవే మైమరచిపోయావు,
నీ కెందుకంత ఆరాటం నేనంటే ...

కందకి లేని 'నిన్ను' కత్తిపీటకి ఎందుకన్నారు ?
ఆ 'నువ్వు' నువ్వేకదా ... ' దురద '  ('itch')..
అందుకే తీర్చుకున్నాను ఇలా ఈ నా సరదా...

కొంతమంది విషయంలో ఆ 'నువ్వే' ప్రియురాలు,
మరి కొంతమందికి ఆ ప్రియురాలే 'నువ్వు...'  
(ఒప్పుకోవటానికి మరీ మొహమాటం మీరూను ..పర్లేదులెండి  తూచ్..తూచ్......)


2 comments:

  1. ha ha!! Hilarious!! :)

    ReplyDelete
    Replies
    1. చూసేవాళ్ళకే సరదా,
      గోక్కునే వాడిదే దురద...

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు