March 8, 2013

ఈ దారి ! రహదారి !!


కవిత రచన : సాత్విక 

ఓరోరి సామాన్యుడా, పొద్దు పొద్దునే లేస్తూనే ....
అవినీతి అన్యాయం అక్రమం అని అరవడం ఆపవోయి ,
ఆలోచించి నిజం గ్రహించి మార్పుకి నాంది పలకవోయి,

మనం మారితే , రేపటి తరం అదే మారుతుందోయి,
నీవే మారకుంటే, ఎప్పటికి మార్పుండదు అంతేనోయి,
వేల కోట్ల కోసం, బడా-బడా నాయకులు చేసారూ చోటాసా స్కాములు,
వంద నోటు కోసం, ఎడా-పెడా సామాన్యులు వేస్తున్నారు బ్యాక్-డోర్ స్కీములు,

వంద నోటు కోసం నీవు నడిచిన రూటు ముందు,
వేల కోట్ల కోసం వారు పడిన పాట్లు వెలవెల బోయెరా,
ఆశ ఉండీ అవకాశం రాని అదృష్టం నీదిరా,
అవకాసమొచ్చి ఆశ చావని దౌర్బాగ్యం వారిదిరా...

దోచుకున్న సొమ్ములో ఎక్కువ-తక్కువలు,
అవినీతి పాళ్ళలోని తక్కువ-ఎక్కువలు,
బలహీనతకివే నేరు కొలమానాలు...

వారి బలహీనత సమర్ధనీయం కాదోయి,  ఏ మాత్రం,
నిజం తెలుసుకొని బలపడవోయి, నీవు మాత్రం…

రసీదులొదలి నీవు చెల్లించిన పైకాలు లెక్క పెట్టుకో,
జీవిత క్రీడలో చేసిన అక్రమాల స్కోరెంతో చూసుకో,
కరప్షణ్ బ్యాంకులో, పొందిన ర్యాంక్ ఎంతో తెలుసుకో,
నీలోని అవినీతిని ఇకనైనా రూపు మాపుకో...

నీ భర్తో - నీ భార్య
నీ అక్కో నీ చెల్లో,
నీ అన్నో - నీ తమ్ముడో,
తప్పు చేస్తే నువ్వు వెన్నుతట్టకోయి,
ప్రశ్నించీ నిలువరించి తెలియచేయవోయి,
వినకపోతే బయటపెట్టు తప్పులేదులేవోయి,

న్యాయముగా పొందినది తగు రీతిన దాచుకొనుటే పొదుపురా,
అన్యాయముగా అందునది మనకొద్దన్న ఆలోచనే అదుపురా,
మనకెందుకు ! మనకెందుకు ! అన్న పదం మరిచిపో,
పద ముందుకు, పద ముందుకు అని నువ్వు మారిపో..

మనమీ ఆలోచనకి బీజము నాటేద్దాము,
ఆలసించక నిరసించక ఆచరించేద్దాము,
మన నైజాన్ని మార్చుకొని చూపిద్దాము,
సమాజాన్ని తరువాత బాగు చేసేద్దాము..

చిల్లరమార్గం వదిలేద్దాము
ఇదే నిజాయితీ అని భావితరానికి చాటేద్దాము,
రాచమార్గం నిర్మిద్దాము
అదే ఆనవాయితీగా తరతరాలకి పాటిద్దాము...

8 comments:

 1. చాలా బావుంది.. ఇప్పుడు లంచం అనేది అఫీషల్ అయిపోయి.. ఇస్తున్న వాడు కూడా ఏ మాత్రం బాధ, సిగ్గు లేకుండా ఇస్తున్నాడు..

  ReplyDelete
  Replies
  1. స్వాగతం వోలేటి గారు.

   లంచం, అవినీతి , దిగజారుడుతనం, స్వార్ధం ... ఇవన్ని చాలా ఇబ్బంది పెట్టేస్తునాయండి. మార్పు రావాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

   ఆస్వాదించి అభినందించినందుకు మీకు మనస్పూర్తిగా సంబెరములు.

   Delete
 2. చక్కటి సందేశం.బాగా రాసారు.

  ReplyDelete
  Replies
  1. స్వాగతం!

   ఓ జలతారు వెన్నెలా,
   కురిపించు ప్రతి నెలా.. హ హ హ హ......

   ధన్యవాదములు మీ అభినందనలకి !!

   Delete
 3. " మార్పు " చాలా అవసరం . అక్షర సత్యాలే . ఆ అక్షర సత్యాలు అక్షరాలలోనే మిగిలిపోకుండా ఆచరణ రూపంలో మారితే ,అదీ ఎక్కడనుంచో కదు యిక్కడనుంచే మొదలుపెట్టాలి , ఎవరినుంచో కాదు , మన నుంచే అని చాలా చక్కగా చెప్పావు.
  ఇందులో ఈ క్రింద వ్రాసినవి వావ్ అనిపించాయి , మరచిపోలేనివి , మరువరానివి .

  దోచుకున్న సొమ్ములో ఎక్కువ-తక్కువలు,
  అవినీతి పాళ్ళలోని తక్కువ-ఎక్కువలు,
  బలహీనతకివే నేరు కొలమానాలు...

  న్యాయముగా పొందినది తగు రీతిన దాచుకొనుటే పొదుపురా,
  అన్యాయముగా అందునది మనకొద్దన్న ఆలోచనే అదుపురా,
  మనకెందుకు ! మనకెందుకు ! అన్న పదం మరిచిపో,
  పద ముందుకు, పద ముందుకు అని నువ్వు మారిపో..

  మనమీ ఆలోచనకి బీజము నాటేద్దాము,
  ఆలసించక నిరసించక ఆచరించేద్దాము,
  మన నైజాన్ని మార్చుకొని చూపిద్దాము,
  సమాజాన్ని తరువాత బాగు చేసేద్దాము..

  చిల్లరమార్గం వదిలేద్దాము,
  ఇదే నిజాయితీ అని భావితరానికి చాటేద్దాము,
  రాచమార్గం(రోడ్డు) నిర్మిద్దాము,
  అదే ఆనవాయితీగా తరతరాలకి పాటిద్దాము...


  శర్మ జీ ఎస్

  ReplyDelete
  Replies
  1. సగం పంక్తులు మీకు నచ్చాయి మరి మిగతా సగం మాటేంటి ?
   అర్ధం అయిందండీ అవి కూడా నచ్చాయి కాకపోతే ఇవి బాగా నచ్చాయి అంటే కదా !!

   ధన్యవాదములు !!

   Delete
 4. Replies
  1. బాగా డై లమా లో ఉండి వోప్పుకోన్నట్టున్నావు ?
   ఎనీవే థాంక్స్.

   Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు