March 22, 2013

రహస్య ఒప్పందం !!


  కవిత రచన : సాత్విక
ప్రకృతిలో అందంగా ఒదిగిపోయావు,
ప్రతి చోటా నీవే ఇమిడి పోయావు,
నాలోనే నీవు కొలువై యున్నావు,
నిన్ను ఇంకొకరిలో వెతికేస్తున్నాను,
నగ్నత్వమా, ప్రతి చోటా నీవే కదుమా !!

అందరూ నీకెరుకేలే,
నువ్వెవరో నీకే తెలియదులే,
నిజానికి  నువ్వు బలమేలే,
నిన్నెవ్వరు భరింపజాలరులే,
నగ్నత్వమా, ఇదే అసలు నిజము సుమా !!

       
నాలోని నువ్వంటే నాకెంతో ఇష్టం,
ఇంకొకరిలో ఐతే మరీ మరీ ఇష్టం,
కొంటె సరదా చేష్టలకి నువ్వే బెస్టు,
తుంటరి ఆగడాలకి నీవే లాస్టు,
నగ్నత్వమా, నా జోలికి నువ్వు రాకుమా!!

పరులు చూడ అయ్యెను నా మనస్సుకి గాయం,
ఇది మటుకు ఖచ్చితముగా ఖాయం,
'చాటు మాటు' నీకు అందించినచో సాయం,
అయిపోతావు నీకు నీవే మటు మాయం,
నగ్నత్వమా, ఈ ఆగడాలు చాలించుమా !!

నిను మొదటిసారి వీక్షించ తహ తహ,
కానీ పలుమార్లు పరికించ అహ అహ,
వరించకు నన్ను నలుగురిలోన,
నిలబెట్టకు తలవంపుల బరిలోన,
నగ్నత్వమా, నవ్వులపాలు  కానీకుమా !!

నీతో నా ఈ సాన్నిహిత్యం, 
గోప్యము అనునిత్యము,
ఉండిపో అందంగా ఎప్పటికీ,
తెలుపనులే  నేనేవ్వరికి,
నగ్నత్వమా, ఇదే మన రహస్య ఒప్పందం !!






8 comments:



  1. చాలా బాగుంది నగ్నత్వమే కాదు , నగ్న చిత్రంతొ సహా , అంతర్లీనమైన మన జీవుల రహస్య ఒప్పందం .

    ReplyDelete
    Replies
    1. నగ్నత్వం అంతర్లీనముగా ఉంటేనే మంచిది , కానీ మారుతున్న సామాజిక పధంలో
      "నగ్నత్వమే నవీన రూపం"గా అవతరిస్తున్నది ....అని ఇలా రహస్య ఒప్పందం గుర్తు చేసుకున్నాను...

      గ్రహించి అభినందించిన మీకు ధన్యవాదములు ... ;-)

      Delete
  2. చాలా బాగుంది, Your selection of genre & Subjects is different.Nice

    ReplyDelete
    Replies
    1. వెధవ మనస్సు పరి పరి విధములుగా పరికిన్చుచున్నది .... అంతేకదండీ మరి...అందుకే కదా అది మనస్సు అన్నాము....

      మీ అభినందనలు నాలో ఎన్నో కొత్త ఆలోచనలు నింపుతూనే వుండాలని కోరుకుంటూ ...
      మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు .....
      Thanks alottttt!!!! ;-)

      Delete
  3. ఇంతబాగా ఎలా రాసారో చెప్పండి....ఎవరికీ చెప్పనని రహస్య ఒప్పందం :-)

    ReplyDelete
    Replies
    1. మీరు కొంచం ఎగతాళిగా అన్నా, పర్లేదులెండి పద్మార్పితగారు తిట్టినా బాగుంటుంది మరి !!
      ఎనీవే , మీరే అన్నారుగా రహస్య వొప్పందం అని మరి ఇలా బ్లాగ్ లో ఎలా వివరించను...

      your visit to this blog, always makes me so happy ... ;-)
      Thanks a lott!!

      Delete
  4. Replies
    1. అభినందనలకి ధన్యవాదములు !!
      Thank you so much.. ;-)

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు