March 12, 2013

నిరీక్షిస్తా ! మీ పై ఒట్టు !!

కవిత రచన : సాత్విక 
ఆత్మ విడువని ఈ దేహాన్ని కాటిలో వదిలేద్దామనుకున్నారు,
పుత్రధర్మము మరచి బ్రతికి ఉండగానే కాటేయదలచారు,
కాలచక్ర దిగ్బంధములో ఈ ఋతువులు మారకుండునా ?
జీవితచక్ర పరిణామంలో నే అసువులు బాయకుండునా ?

స్వీయ ఆత్మ త్యాగం పాపమని వేదాలు వల్లిస్తున్నాయి,
ఇంకెంత కాలమీ అగ్నిపరీక్షా అని నా ఆత్మా ఘోషిస్తున్నది,
కాల ధర్మానికి తలొగ్గి నిల్చున్న సైనికుడిని నేను కాదంటారా?
కాలం చేసిన జాప్యం లోన నేనొక చిత్రయోధినేనంటారా?

నేనూ పయనించాను నవ మాసాలే నా తల్లి గర్భమున,
అందరిలాగే ఉపక్రమించాను జీవనయానం ఈ కాలగర్భమున,
అడగకనే అందించారు ఆప్యాయతని తొలి జీవిత భాగమున,
అడుగకనే అంతమొందిస్తున్నారు ఈ ఆఖరి అంకములొన...

మీ బాల్యదశలో నే కొసరికొసరి గోరుముద్దలు తినిపించాను,
నా ఈ  అవసానదశలో కసిరివిసిరి వేరుముద్దలు విదిలించారు,
నేనెన్నడు కోరలేదు అరిటాకులలో విందు భోజనాలు,
సరిపోవును కదా ఆప్యాయత విడిదిలోన కొద్దిపాటి పలకరింపులు,
నా బాల్యం గడిచింది ఎన్నెన్నో ఆట పాటలతో చక చకా,
ఈ సమయం గడుస్తున్నది విషపు ఆట విడుపులతో హర హరా...

యవ్వన ప్రాయమున నేను  కట్టలేని వస్త్రమున్నదా? ఈ భువినందు,
అస లే వస్త్రమూ నిలువకున్నది ఇప్పుడు దిసి మొలయందు,
వృద్దాప్యమున ఈ నా కరములు అదుపు తప్పి పట్టు సడలెనే,
నవ్విపోదురు గాక నాకేంటన్న మాటే, నా సిగ్గుని జయించెలే...

ఏ ఆసరా లేకుండానే జీవిత కడలిలో ఒంటరిగా పరిగెట్టానంటే,
కట కటా నీవన్నీ తుంటరి ప్రగల్భాలని మీరంటుంటే,
మీ మొహం చఱచి నే నిలువ ప్రయత్నించకుందునా ?
నిలువలేక అహం దెబ్బ తిన్న ఆ క్షణం నే మరువగలనా ?
శిధిలమయినది నా దేహం అని మీకు లేదు కనీసం ఆ యింగితం,
మలినమయినది మీ మనస్సు అని నా మటుకు నాకు అయింది అవగతం...

నా వయస్సుకి నేనే భారంఅదే వయోభారమోయి,
మీ వయస్సుకీ నేను భారమా? ఇదే విపరీత భావమోయి ,
చరమాంకంలోన నన్ను విడిచి వెళ్ళిపోయింది నా జీవిత శోభ,
పరమావధిలొన మీరు నాకు మిగిల్చారు మానసిక క్షోభ,
మీ అవసరాలన్నీ నేను పసిగట్టి పట్టుబట్టి మరీ తీర్చాను,
నేనే అనవసరం అని మీరు  తూట్టుపెట్టి మట్టు పెట్టదలచారు...

సత్యమేవ జయతే అని కావలి కాసిన హరిశ్చంద్రుడు నా జట్టు,
మరణం సమీపించువరకు నేనిచటనే నిరీక్షిస్తాను మీ పై ఒట్టు,
అంపశయ్య మీద భీష్ముడికీ తప్పలేదు కదా ఈ నిరీక్షణ మెట్టు,
ఇది కాదా? ప్రతి జీవితో విధి ఆడే యధావిధి కనికట్టు,
ఎకడొకచొట, ఎపుడోకప్పుడు తప్పదీ ఆత్మాభిమాన తాకట్టు ...

14 comments:

  1. వృద్దాప్యం లో నిర్లక్ష్యం చెయ్యబడిన ఒక తండ్రి అనుభవిస్తున్న బాధ చాలా బాగా రాసారు.

    ReplyDelete
    Replies
    1. అమ్మా ఇక్కడే కూర్చో టికెట్ తెస్తా !!
      నాయన ఈడే కుకో చిన్న పని చూసుకు వస్తా !!
      అని వదిలి వెళ్ళే సుపుత్రులు ఎందరో ??
      మనస్సు చివ్వుక్కు మన్నది ఒకసారి ఇలాంటి న్యూస్ చదివి..

      మీ అభినందనలకి ధన్యవాదాలు.

      Delete
  2. చాలా బాగా present చేసారు.Very heart touching.

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలే కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
      ధన్యవాదాలు వెన్నెల గారు.

      Delete
  3. presentation is good,but with little bit changes in life style may change their lifes into Graceful ageing I think.

    ReplyDelete
    Replies
    1. Thanks Padmarpita gaaru.
      Its true, everyone (wherever there is a need) should think of it.
      Thanks a lot for your signature in my blog, its a great encouragement to me.

      Delete
  4. హాయ్,

    చెప్పాలంటే " ఔనంటారా ! కాదంటాఋఆ ! " లా చాలా చాలా బాగుంది.

    మరువలేనివి చాలా ఉన్నాయి , మచ్చుకు
    " నా బాల్యం గడిచింది ఎన్నెన్నో ఆట పాటలతో చక చకా,
    ఈ సమయం గడుస్తున్నది విషపు ఆట విడుపులతో హర హరా...

    సత్యమేవ జయతే అని కావలి కాసిన హరిశ్చంద్రుడు నా జట్టు,
    మరణం సమీపించువరకు నేనిచటనే నిరీక్షిస్తాను మీ పై ఒట్టు,
    అంపశయ్య మీద భీష్ముడికీ తప్పలేదు కదా ఈ నిరీక్షణ మెట్టు,
    ఇది కాదా? ప్రతి జీవితో విధి ఆడే ఎధావిధి కనికట్టు,
    ఎకడొకచొట, ఎపుడోకప్పుడు తప్పదీ ఆత్మాభిమాన తాకట్టు ...

    బై,

    ReplyDelete
    Replies
    1. మనస్పూర్తిగా ధన్యవాదములు !!

      Delete
  5. Very nice!! Manchi quality and depth undhi!! Very good!! Keep it up!! :)

    ReplyDelete
    Replies
    1. That pain itself is really having great quality in it, and thanks for your comment on the same... ;-)

      Delete
  6. chala baga raasavu annayya

    ReplyDelete
    Replies
    1. స్పందనకి ధన్యవాదములు స్పందన చెల్లెమ్మా!!

      Delete
  7. Anonymous3/14/2013

    chala chala bagundhi ee kavitha.. too good and wonderful
    vrudhapyamlo aina vallu chudakapothey vallu pade vedana varnana chala chakkaga undhi

    ReplyDelete
    Replies
    1. Thank you anonymous.
      జన జీవన స్రవంతి లో కలవటానికి నీకిదే నా ఆహ్వానం!! ;-)

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు