March 3, 2013

ఈ-మెయిల్ ఐ.డి. ... ప్లీజ్ !!


కవిత రచన : సాత్విక


కనులలో, కను రెప్పలు కాపాడును కంటి పాపను, 
కానీ,  కామాంధులు కాటేస్తున్నారు మన ఇంటి పాపను,
మానవత్వం అంతమొందితే , మౌనమే బెదిరిపోదా ?
కట్టుబాట్లని కాలరాస్తే , సంస్కృతే అమావాస్య చంద్రుడవ్వదా ?
సంధిస్తా ప్రశ్నలతో ఈ-మెయిలు , అందిస్తా భావి తరానికి ఈ మేలు !

అంగట్లో, కొవ్వొత్తి కరుగుతోంది వెలుగు నింపటానికి,
సమాజంలో,  మదశక్తి పెరుగుతోంది మన దుంప తెంచటానికి,
ధర్మమే దగా పడితే ,  ఈ ధరిత్రి దద్దరిల్లదా ?
కారుణ్యం కనుమరుగయితే, కాలమే సేద తీరదా ?
సంధిస్తా ప్రశ్నలతో ఈ-మెయిలు , అందిస్తా భావి తరానికి ఈ మేలు !


ఒంట్లో, అనునిత్యం  తోడయి వున్నది ఈ గుండె చప్పుడు
ఆరుబయట, వనిత ఒంటరిగా విహరించగలిగే ఆ సమయమెప్పుడో,   
నవశక్తి నీరు కారితే , ఆ ప్రవాహానికి న్యాయమే నిలువగలదా ?
హింసే ఆయుధమయితే ,  ఈ జీవ-శక్తి నిలచి నిలువరించునా ? 
సంధిస్తా ప్రశ్నలతో ఈ-మెయిలు , అందిస్తా భావి తరానికి ఈ మేలు ! 

4 comments:

  1. శ్రీ శ్రీ గారు చెప్పినట్లు " అగ్గిపుల్ల , సబ్బుబిళ్ళ కాదేదీ కవితకనర్హం " .

    ఈ మెయిల్ ని కూడా , ఈ మేలుగ మార్చి చెప్పటం చాలా బాగుంది .

    "కట్టుబాట్లని కాలరాస్తే , సంస్కృతే అమావాస్య చంద్రుడవ్వదా ?"
    సమాజంలో, మదశక్తి పెరుగుతోంది మన దుంప తెంచటానికి,"
    ధర్మమే దగా పడితే , ఈ ధరిత్రి దద్దరిల్లదా ?"

    శర్మ జీ ఎస్

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ సారూ ...

      Delete
  2. Chala bavundi!! u r rocking!!

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ జీ !!

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు