March 15, 2013

స్వయం ప్రకాశితం ...


కవిత రచన : సాత్విక 
మీకు తెలియదా దానకర్ణుడి దీనగాధ,
అంతకన్నా తీసిపోదు మా ఒక్కో వ్యధ,
ఆదరణకి నోచుకోకుండా నా ఈ భాద,
అవ్వకూడదు సమాజ దృష్టిలో అనాధ,
అందుకే వినిపిస్తున్న నా మనస్సు కధ,

కక్కుర్తికి కన్నారు,
ప్రకృతికే నీవన్నారు,

'అమ్మా నాన్న' అనే పదాలు విన్నాను,
వారే నన్ను కనుంటారేమోననుకున్నాను,

నేనెవర్ని ప్రశ్నించలేదు ఇరుకునబెట్టి,
హునాకు వారెవరో తెలియదు కాబట్టి,

కొద్దిసేపటి ఒంటరి భావం కావచ్చు కవిత్వానికి ప్రేరణము,
కానీ అదే భావం అయిపొయింది నా జీవితకాల గ్రహణము,

బస్సురైల్వే ప్లాట్ఫారాలే నాలాంటి  సహచరులకి స్థావరం,
ఎంతోమంది తీర్చుకుంటున్నారు మాతో/పై వారి కండకావరం,

దరి చేర్చుకున్నారు ఎంతోమంది మేమున్నామని అక్కున,
కొత్త మమ్మీ డాడీలంటూ అమ్మేశారు విదేశాలకి చటుక్కున,

మనస్సే శీతాకాలమాయేనేస్పందన కరువై బిగిసిపోయేనే,
కన్నులే ఎండాకాలమాయెనేజలపాతాలు లేక ఎండిపోయేనే,

అందరి ఎదటే నిరాదరణకు లోనయిన పాంచాలి వ్యవహారము,
అద్దం పట్టును కదా అనాదిగా వస్తున్న అనాదరణ పారంపర్యము,

పిల్లలచే వెలివేయబడ్డ తల్లి తండ్రుల విషయమేమిటి?
వంటిం(టి)కే పరిమితమయిన అతివల పరిస్థితేంటి?
పార్టీల మోజులోపబ్బుల క్రేజులోసెలబ్రిటీ అన్న రివాజులో,
హై క్లాసు సొసైటీలో నిరాదరణకు లోనయిన మానసాల మాటేమిటి?

కళ్ళు మూసి, మనస్సు తెరిచి సమాజాన్ని లోతుగా పరికించవోయి,
అగుపిస్తారు ఎక్కువగా 'అవసరాలు తీర్చబడ్డ అనాధ'లే కదోయి,

అనాధ అని సంబోధించినప్పుడు అమితంగా బాద పడ్డాను,
నిజానికి తల్లి తండ్రులచే వెలివేయబడ్డవారే కాదు అనాధలంటే,
నిరాదరణకు గురి అయిన ప్రతివారూ ఆనాధలే,
పసివయస్సులోనే వెలివేయబడ్డ ప్రతి జీవులు స్వయం ప్రకాశితాలే..

చీకటిలోని వెలుగే నన్ను నడిపించింది,
మౌనములోని మాటే నన్ను పలకరించింది,
మంచులోని వెచ్చదనమే నాకు సేద తీర్చింది,
నిశ్శబ్దభీతి తోడుగ నిలచి నాకు ధైర్యం చెప్పింది,

ఎవ్వరూ తోడే కాకున్ననాదంటూ ఎదీ లేకున్నా,
వెలుగురేఖల జాడే రాకున్ననిశీధిలో నే పయనిస్తున్నా,
అందుకే అనాధని కాను ' స్వయం ప్రకాశితాన్ని' ఈ భువిలోన...



8 comments:

  1. Anonymous3/15/2013

    మరీ అంత నిరాశపడద్దు వెలుగు రేఖ కనపడితీరుతుంది. ఆశా జీవులం.remove word verification

    ReplyDelete
    Replies
    1. స్వాగతం కష్టేఫలే గారు...

      స్పందనకి ధన్యవాదములు...
      I have removed word verification. Thanks for notifying me

      Delete
  2. Replies
    1. ఆస్వాదిన్చినందుకు అభినందనలు...

      మీ అభినందనలకి ధన్యవాదములు.

      Delete
  3. హాయ్,

    కనపడని మనసుని కదిలిస్తున్నాయి కొన్ని కొన్ని ఫ్రేం లు.

    మనస్సే శీతాకాలమాయేనే, స్పందన కరువై బిగిసిపోయేనే,
    కన్నులే ఎండాకాలమాయెనే, జలపాతాలు లేక ఎండిపోయేనే,

    నిజానికి తల్లి తండ్రులచే వెలివేయబడ్డవారే కాదు అనాధలంటే,
    నిరాదరణకు గురి అయిన ప్రతివారూ ఆనాధలే,

    చీకటిలోని వెలుగే నన్ను నడిపించింది,
    మౌనములోని మాటే నన్ను పలకరించింది,
    మంచులోని వెచ్చదనమే నాకు సేద తీర్చింది,
    నిశ్శబ్దభీతి తోడుగ నిలచి నాకు ధైర్యం చెప్పింది,

    బై,

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు....

      Delete
  4. చాల చాల బావుంది ఈ కవిత !!! అన్ని ఏరియాస్ టచ్ చేస్తున్నావ్ . రైటర్ కుండాల్సిన ప్రథమ లక్షణం ఇదే !! గుడ్ గోయింగ్ !! :)

    ReplyDelete
    Replies
    1. మనస్సు అన్నిటి మీద స్పందించడమే మనిషి కుండాల్సిన ప్రధాన లక్షణం ....కదా....

      అభినందనలకి ధన్యవాదములు...

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు