March 3, 2013

మౌనమేలనోయి....


కవిత రచన : సాత్విక
అమ్మ చెప్పింది ఇది మన వంశ వృత్తని,   
తెలియదు నాకు  ఇంత హింస ఉన్నదని,

 పూటకాపూటే వీడే నీ మొగుడన్నారు,
పరిపాటిగా తరవాత వాడే విటుడన్నారు

దాగమంటే ఆగనంది  నా శోభిత పరువం,
దగాబడ్డ క్షణాలతో నిండింది నా  జీవిత పర్వం,

పంచి ఇమ్మంటున్నారు నా వయస్సు ,
అంటూనే తుంచి వెళ్ళిపోతున్నారు నా మనస్సు

ఎవ్వరూ మరువరు నా సోగసు,
ఏ ఒక్కరూ కోరరు నా శ్రేయస్సు,

అల్లరి చేష్టలు తగవన్నాను, 
చిల్లర డబ్బులే నీకన్నారు,

తాళెందుకు పొమ్మన్నారు,
ఎగతాళి చేసేందుకే..  వీరందరూ,

దాహం తీర్చే కొలనయినాను,
జీవం కలిగున్నా శిల నయినాను,

రోజంతా నేను ఒక ఒంటరి తురాయి,
రేయంతా నా మనస్సుకు నేనే పరాయి, 

స్థిరం లేని నిలయం నా ఈ ఆవాసం,
విధి నిర్దేశించిన వలయం ఈ నా సావాసం 

ఉసూరు మంటూ వడ్డించాను నడిరేయంత
జీ హుజూర్ అంటూ అర్పించాను నా తనువంతా,


ప్రతి రేయి ఓ విగ్రహం కదలాడింది నా కంటి ముందర,
గతి తప్పక  నిగ్రహం తొణికిసలాడింది నా  పంటి బిగువున,

వానపాముని వద్దనలేదు, కాలనాగుని కాదనలేదు, 
వానమే వెక్కిరించింది , కాలమే కడకు కాటేసింది,

ఈ  వారసత్వపు చితి భస్మానికి నేనే చిరునామా, 
ఏ తల్లి తన బిడ్డ జీవనభ్రుతికి రాయకూడని వీలునామా.

19 comments:

  1. హాయ్ ,



    వాహ్ , చాలా చాలా బాగుంది . విషయముంది , వైవిధ్యత ఉంది , నాణ్యత ఉంది . ఈ తరహా వారసత్వాన్ని ఏ తల్లీ అందించకూడదని ఎంతో చక్కగా చెప్పావ్ .





    శర్మ జీ ఎస్

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు , మీరు మెచ్చినందుకు ధన్యవాదములు!!

      Delete
  2. Rajasekhar Cherukuri3/03/2013

    నీ కవితా సాగరంలో ఇదొ ఒక తీపి బిందువు !!

    ReplyDelete
    Replies
    1. స్వాగతం స్వాగతం !!

      ఎం రాజా ? ఒక బిందువు అన్న తీపి బిందువు అన్న మా రాజానే అని అనుకుంటున్నాననెగా ?
      (డైలాగు కర్టసి : పిల్ల జమిందార్ మూవీ లో నాటకం రిహార్సల్ సీను ).... హ హ హ

      ప్రోత్సాహానికి థాంక్స్ రాజశేఖర్ !!

      Delete
  3. This is Fantastic!! U can write fantabulous poetry if u really concentrate and develope urself!!

    ReplyDelete
    Replies
    1. ప్రోత్సాహానికి ధన్యవాదములు !! తప్పక ప్రయత్నిస్తాను , కాకపొతే ఎవరయినా హర్ట్ అయి నా మీదకు దండయాత్రకి వస్తే మటుకు నీ పేరే చెబుతా 'వుసి గోలిపావని' హ హ హ హ ...........

      Delete
  4. annaiyya adbhutammaina words, expression feelings , annaiyya ippatidaaka yenduku raayaledu ani anipinchentha baagaa raasavu, keep going with gud words and expressions :-)

    ReplyDelete
    Replies
    1. 'ఇన్నాళ్ళు ఎందుకు రాయలేదా' అన్న నోటి నుంచే 'ఇంకా ఎందుకు రాస్తున్నావు' అనిపించేంత వైవిధ్యం ప్రదర్శించడానికి నా సాయి శక్తులా ప్రయత్నిస్తాను ...
      హ హ హ హ ....

      అభినందనలకి ధన్యవాదములు !!

      Delete
  5. Anonymous3/03/2013

    wow annayya excellentga raasavu keep going --spandana

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ స్పందనా, యాక్సిడెంట్స్ జరుగాతాయి మనమేమి చేయలేము...

      తప్పులుంటే క్షమించు అసలు అర్ధమే తప్పనుకుంటే మన్నించు ..... హ హ హ ......
      (పేద రాయుడు డైలాగు వాడేసా, ఊరికే బాగుందని ..... )

      ఎనీవే , ఒన్స్ అగైన్ థాంక్స్ ఫర్ ప్రోత్సాహం ......

      Delete
  6. chaalaa baaga rasaru vyadha gurinchi abhinanadanalu

    ReplyDelete
    Replies
    1. స్వాగతం సుస్వాగతం నా సమోసాల బండి కి.

      థాంక్స్ అండి చెప్పాలంటే గారు.

      ఇలాంటి మీ అభినందనలు ఖచ్చితముగా చెప్పాలండి, నేను కూడా అందుకోవాలని కోరుకుంటున్నాను హ హ హ ...

      Delete
  7. సరళమైయిన పదాలతో లోతయిన భావాన్ని చక్కగా చెప్పారు. Kudos

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలకి థాంక్స్ వెన్నెల గారు.
      బలవంతంగా నెట్టబడిన వారి భాద వర్ణనాతీతం అండి.

      Delete
  8. మీ భావాలు ఎప్పుడూ బాగుంటాయి. చెప్పే విదానం చాలా హుందాగా ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. ప్రోత్సహించడం మీ నైజం ...మంచి విషయం ....ధన్యవాదములు....

      Delete
  9. Queen Victoria8/27/2023

    Oka kavi ki vundalsina lakshanalalo okati verey valla sadness ni feel avvakundaney feel avuthu oka manchi kavathatho sangamlo chaitanyam thiskuravatam you have that kinda heart sir superb ..🫡keep going

    ReplyDelete
  10. Anonymous8/27/2023

    Super sir

    ReplyDelete
  11. Kamal Kishore S8/27/2023

    చాలా బావుంది!👌🏼👏🏼

    ReplyDelete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు