March 29, 2013

వేసవి ప్రేమలు !!


కవిత రచన : సాత్విక
పొద్దున్నే పనిగట్టుకు వస్తావు,
నాచేతే పాటలెన్నో పాడిస్తావు,
హుషారుగా ఉరకలు వేయిస్తావు,
విషయ వివరణలతో వేయించేస్తావు,

నన్ను ఎవ్వరిని చూడోద్దంటావు,

నేను నిన్ను మాత్రమే చూడాలంటావు,
ఎవ్వరితో నన్ను మాట్లాడద్దంటావు,
నీవు మటుకు అందరినీ పలకరిస్తావు,

సమాధానం చెప్పలేని ప్రశ్నలేస్తావు ,
నన్నే నువ్వు ఎక్కువగా వేధిస్తావు,
నా గురించే ఎక్కువగా ఆలోచిస్తావు,
అందరిలోన నిలబెట్టి ఇబ్బంది పెడతావు,

ఒక్కరోజు కలవకపోతే నా పద్ధతేమి బాలేదంటావు,
నా నుంచి ఎన్నెన్నో సంజాయిషులు కావాలంటావు,
నా మంచీ, చెడ్డల సమాచారం మొత్తము సేకరిస్తావు,
కనిపించిన ప్రతివారికి చూపించి మరీ వివరించేస్తావు,
అల్లరి చేష్టలు భరించి ఓర్పుతో ముందుకు నడిపిస్తావు,

పైన వివరించిన నా భావనే,
మాలో ప్రతి ఒక్కరికి నీతో నిజమే,
మేము రెండో క్లాసు అల్లరి పిల్లలమే,
'మీరు' నుంచి 'నువ్వు' అనేంతగా కలసిపోయావ్,
మమ్మల్ని నీ నుండి దూరం చేసేస్తున్నదీ సమ్మర్,
అందుకే  వీ మిస్ యు టీచర్” & "వీ లవ్ యు టీచర్".

9 comments:

  1. haha!! very nice .. till the last stanza i couldn't really understand whom u r talking abt!! :)

    ReplyDelete
  2. Wow..so cutee and chweettt.

    ReplyDelete
    Replies
    1. అల్లరిని కూడా సరదాగా చూస్తే స్వీట్ & క్యూట్ కదా మరి !!

      Delete
  3. టిచర్ / మాష్టర్ లు ఇన్ని చేస్తుంటారా అనిపిస్తుంది ఇది చదివిన తర్వాత .వావ్!

    ReplyDelete
    Replies
    1. ప్రతి వాక్యం క్లాసు రూంలో జరిగేవే మరి ....హ హ హ !!

      Delete
  4. very true... nice one

    ReplyDelete
  5. Replies
    1. బహుకాల మీ దర్శనం భలే బావుంది
      నాకు కూడా !!

      ధన్యవాదములు !!

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు