March 25, 2013

ష్.. ష్.. ఎవ్వరికీ చెప్పను/ద్దు

కవిత రచన : సాత్విక
కాలము రహస్యముతో --

నీ ఇంటి పేరే అపహాస్యమా !
అయ్యో !  పాపం ఓ రహస్యమా !
ఆకారం అన్నది అసలు లేనేలేదులే,
ఆయుర్దాయం అంతంత మాత్రమేలే,
నువ్వు బంధువే కదా అందరికి,
అయినా చులకనే ప్రతి ఒక్కరికీ ...

ఎవ్వరికీ చెప్పద్దంటూనే ఎవరెవరికో చెప్పేస్తారు,
ఎవరికివారే తమకు మాత్రమే తెలుసనుకుంటారు,
'ఎవ్వరికీ చెప్పొద్దూ' అన్న మాటే 'నీ' ప్రసార సాధనమయ్యేనే,
ఇదే అసలు సిసలు ఆధునిక రహస్య ప్రచార మంత్రములే,
నువ్వందరికీ ఎరుకేనన్న అసలు రహస్యము వారెరుగరులే,
డంగవుతారు, వారి విషయమే చేరినచో వారిని రహస్యముగా,
ఓ నా రహస్యమా!  సమజవ్వవు ఎప్పటికీ  'నీ' భాదలు సంపూర్ణముగా

అదే కాలము మనిషితో --

రహస్యమున్నదే అవ్వడానికి లీకు,
అది చేస్తుంది అందరి నిగ్రహాన్ని వీకు,
నువ్వు దాచి పెట్ట ప్రయత్నించమాకు,
దాని జోలికి నువ్వస్సలు పోమాకు ...

రహస్యానికి కుదురు తక్కువోయి,
దాన్ని జయించునది కుతూహలమేనోయి,
మూగవానిని మంచిగా మాట్లాడించగలదు,
చెవిటివానికి చక్కగా వినిపించగలదు,
గ్రుడ్డివానికి సైతము దర్సనమిచ్చును,
మాములోడిని మాత్రము మభ్యపెట్టును ...

ఒరేయి బావా , ఎవ్వరికీ చెప్పొద్దురో,
ఎవండోయి పిన్నిగారు, ఎవ్వరికీ చెప్పొద్దూ,
నీకు మాత్రమే చెప్తున్నా, నీవెవరికీ చెప్పొద్దూ, 
ఎవ్వరికీ చెప్పనని ఒట్టు పెట్టి మరీ అడిగేవాళ్ళు కొందరు,
ఒట్టు పెడితే చాలు చెబుతానని వెంటపడేవాళ్ళు మరికొందరు,
రహస్యం రగిల్చిన 'కుతూహల'  క్రీడలోని సభ్యులే పై వారందరూ,
రహస్యానికి నిదానము లేదులే, విష(య)దానము తప్పక చేయించునులే ... 

కొందరి రహస్యం మరికొందరు చెప్పును తమ జోస్యముగా, 
అదే జోస్యము ఇంకొందరికి తోచును యమ హాస్యముగా,
మది లోతుల్లో వారిని గూర్చి వారే వినలేని నిజాలెన్నెన్నో,
అంతరాలలో మనస్ఠాపితమయిన ఎనలేని రహస్యాలెన్నెన్నో,
ఎవ్వరికీ తెలియకూడదని నీవు భావించిన, అది రహస్యముగా నిలవదోయి,
నీ మది లోతుల్లో ఖననమయిన నిజాలు మాత్రమే రహస్యముగా నిలుచునోయి,
నీ పెదవి దాటిన పిమ్మట అది విష(య)మే గాని రహస్యమెంతమాత్రము కాదోయి,
అందరికీ విషయము తప్పక చేరును కానీ అది చేరు మార్గము నీకు రహస్యమేనొయి ...

నేను మీతో -- 
బై ద వే మీ దగ్గరేమయిన రహస్యం వుంటే చెబుదురు , ఎవ్వరితో చెప్పను .... ఓ.కే  నా....  

4 comments:

  1. Wow.. చాలా బాగుంది.
    అందరికి తెలిసిన రహస్యం -- మీ post అధుర్స్.
    Really amazed by your selection of Simple topics and Interesting presentation.

    ReplyDelete
    Replies
    1. అలా చూసి వెళ్లిపోయేవాళ్ళు ఎందరో,
      గుమ్మం దాటొచ్చి పలకరించేవాళ్ళు కొందరే ....

      మీ అభినందనలు నాకు కొత్త ఉత్సాహాన్ని యిస్తున్నాయి.
      మనస్పూర్తిగా మీకు ధన్యవాదములు!!

      Delete
  2. very nice!! and that's what is the truth :)

    ReplyDelete
    Replies
    1. ష్.. రహస్యమిది ! ఎవ్వరికి చెప్పద్దూ !!

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు