కవిత రచన : సాత్విక
నిస్వార్ధమైన ప్రేమ నిజం కాదని తెలుసుకో,
నిగూఢమైన ఈ నిజాన్ని ఎఱిగి మసులుకో,
ప్రేమ కోరుతుంది ' ప్రేమనే ' అన్న నిజం మరువకు,
ప్రేమించడం అంటేనే ' ప్రేమ 'ని పొందుట కొరకు,
నిస్వార్ధంగా ప్రేమిస్తున్నానని నువ్వు ' భ్రమ ' పడకోయి,
సరితూచుట యిచట తగదోయి, అవి పంచుకున్న ప్రేమలే కదోయి,
ఎంచిచూచుట వలదోయి , ప్రేమని కొలిచే తులాభారమే లేదోయి,
నిషేదించు ' నిస్వార్ధం ' అన్న ' పురానా ' వాక్యాన్ని,
కలిగించు పంచుకుందామనే ' నయా ' స్వభావాన్ని,
' నిస్వార్ధం ' అనే మాటకి మనందరం చేసేద్దాము అంపకాలు,
తారతమ్యాలు వదలి, పెట్టేద్దాం ఈ సనాతన ఒరవడికి సంతకాలు,
నిస్వార్ధమయిన ప్రేమని పంచానని నీవు తలిస్తే,
అంతర్లీనముగా ' తృప్తి 'ని పొందే అలవాటుకి నీవు బానిసవే,
నిస్వార్ధం కాదది, ' నీ ' స్వార్ధం కూడా దాగుందని నీ వెఱుగవోయి...
నిగూఢమైన ఈ నిజాన్ని ఎఱిగి మసులుకో,
ప్రేమ కోరుతుంది ' ప్రేమనే ' అన్న నిజం మరువకు,
ప్రేమించడం అంటేనే ' ప్రేమ 'ని పొందుట కొరకు,
నిస్వార్ధంగా ప్రేమిస్తున్నానని నువ్వు ' భ్రమ ' పడకోయి,
ప్రేమ ని యిస్తున్నానన్న ' తలంపే ' నీదోయి,
మనస్సే కోరుతోంది ' నిస్వార్ధ ప్రేమ ' అనే 'భావనే' కిరాయి,
ఈ సత్యమెరగక చేయకు నీ 'మనస్సునే' నీకు పరాయి,మనస్సే కోరుతోంది ' నిస్వార్ధ ప్రేమ ' అనే 'భావనే' కిరాయి,
సరితూచుట యిచట తగదోయి, అవి పంచుకున్న ప్రేమలే కదోయి,
ఎంచిచూచుట వలదోయి , ప్రేమని కొలిచే తులాభారమే లేదోయి,
నిషేదించు ' నిస్వార్ధం ' అన్న ' పురానా ' వాక్యాన్ని,
కలిగించు పంచుకుందామనే ' నయా ' స్వభావాన్ని,
' నిస్వార్ధం ' అనే మాటకి మనందరం చేసేద్దాము అంపకాలు,
తారతమ్యాలు వదలి, పెట్టేద్దాం ఈ సనాతన ఒరవడికి సంతకాలు,
నిస్వార్ధమయిన ప్రేమని పంచానని నీవు తలిస్తే,
అంతర్లీనముగా ' తృప్తి 'ని పొందే అలవాటుకి నీవు బానిసవే,
నిస్వార్ధం కాదది, ' నీ ' స్వార్ధం కూడా దాగుందని నీ వెఱుగవోయి...
Now I declare u as a Versa"tile" Writer!!:)
ReplyDeleteనిస్వార్ధముగా ప్రకటిస్తున్నావా ? లేక
Delete'బెస్ట్ కామెంటర్' అవార్డు విన్నింగ్ కోసం చేసిన ప్రయత్నమా ?
హ హ హ థాంక్స్ !!
హాయ్,
ReplyDeleteఓ వైపు " నిస్స్వార్ధం " అంటూనే ,మఱో వైపు అంతరాంతరాలలో దాగున్న ఆ " నీ స్వార్ధాన్ని "
వెలికి తీసి తెలియచేయటం చాలా బాగుంది .
టైటిల్ కూడా ఓ వెరైటీ గా ఉంది " నాకు ఓ కే...! , మీకూ ఓ కేనా.... ? " ,అనుమానమేమీ లేదు అందరికీ ఒ కేనే అని చెప్పేటట్లుగా ఊంది.
శర్మ జీ ఎస్
హా హ హ.... థాంక్స్.
Delete