కవిత రచన : సాత్విక
మా ఇంట్లో...
మా అమ్మ తాయారు,
పెళ్లి చూపులు నాకొద్దన్నా తయారు...
పెళ్లి చూపులు నాకొద్దన్నా తయారు...
అమ్మాయి ఇంట్లో......
పిల్లని తల ఎత్తించి చూపించారు,
తలదించుతూ ఆమె విసిరిన చూపు,
నింపెను నాలో ఏదో చిన్న హోపు,
తలదించుతూ ఆమె విసిరిన చూపు,
నింపెను నాలో ఏదో చిన్న హోపు,
నాకు పోయింది నచ్చుతుందా అన్న శంక,
నేనే నచ్చకపోతే చెప్పాలి కదా ఏదో ఒక వంక,
ఆ తొలి చూపులోనే నేనామేను ప్రేమించేసాను,
'పెళ్లి చూపులలో ప్రెమేంట'ని తెగ ఆలోచించాను,
"లవ్ అట్ ఫస్ట్ సైట్" నిజమని నమ్మేసాను,
ఆ మాటకు "కాపీ రైట్" పెళ్లి చూపులవే అనేసాను,
ఆ తొలి చూపులోనే నేనామేను ప్రేమించేసాను,
'పెళ్లి చూపులలో ప్రెమేంట'ని తెగ ఆలోచించాను,
"లవ్ అట్ ఫస్ట్ సైట్" నిజమని నమ్మేసాను,
ఆ మాటకు "కాపీ రైట్" పెళ్లి చూపులవే అనేసాను,
నీ బయో డేటా చెప్పు వినాలన్నాడు...
కట్నమెంతని అన్నది పక్కింటి పిన్నిగారు,
జాతకాలు చూపించండన్నది కాబోయే అత్తగారు..
అందరి వాలకం చూస్తే నాకొచ్చింది డౌటు,
చేయనే చేయదల్చుకోలేదు ఏ మాత్రం లేటు..
ఆ అమ్మాయిని పక్కకు పిలిపించాను,
నా మనసు లోని విషయం బయట పెట్టేసాను,
ఒకరికొకరం నచ్చామని డిక్లేర్ చేసేసాము,
పెళ్లి మంత్రాలు అందరికి వినిపించేసాము...
ఆ అమ్మాయిని పక్కకు పిలిపించాను,
నా మనసు లోని విషయం బయట పెట్టేసాను,
ఒకరికొకరం నచ్చామని డిక్లేర్ చేసేసాము,
పెళ్లి మంత్రాలు అందరికి వినిపించేసాము...
అసలు 'పెళ్లిచూపల జంట'లే గ్రేట్ అంటాను, మేమే ధైర్యవంతుల చిట్టాలో బెస్ట్ అంటాను...
పెద్దోళ్ళ ఎదురుగానే 'సైట్' కోడతాము, 'విత్ యువర్ పర్మిషన్' అంటూ బాతాఖాని లెడతాము,
'ఓ బామ్మరిది మీ అక్కకి ఫోన్ ఇవ్వు' అంటాము, మా దమ్ము చూడరో అని రొమ్ము విరుస్తాము,
'ఎంగేజ్మెంట్' చేయండని అర్జిలేడతాము, ఏమి లేదులే అంటూనే షికార్లుకి వెడతాము,
పెళ్ళికి దారి తీసిన ప్రతి పెళ్లిచూపులూ
'లవ్ అట్ ఫస్ట్ సైట్' అన్న మర్మం,
'లవ్ అట్ ఫస్ట్ సైట్' అన్న మర్మం,
అయింది నాకు అవగతం,
మిగిల్చేను ఎంతో ఆనందం!!!
మిగిల్చేను ఎంతో ఆనందం!!!
బాగుందండి మీ love at పెళ్ళీచూపులు
ReplyDeleteకొంతమంది "మాది లవ్ మ్యారేజ్" అని ఒకింత గర్వంగా చెప్పడం చూసి...... కామెడీ గా ఇలా టపా రాసాను అంతే .....
Deleteఅభినందనలకి ధన్యవాదాలు !!
శుభాకాంక్షలు.
ReplyDeleteస్వాగతం శ్యామలీయం గారు.
Deleteధన్యవాదములు...
nice post....
ReplyDeleteధన్యవాదాలు.
సుదీర్
http://techwaves4u.blogspot.in
తెలుగు లో టెక్నికల్ బ్లాగు
Thanks
Deletehaha!! nice one!!
ReplyDeleteThanks..
Delete