March 13, 2013

వాస్తవ కల్పనా? కల్పిత వాస్తవమా?

కవిత రచన : సాత్విక


వాస్తవం అన్నదిలా...

ఓ కల్పితమా !!
నీ ఉనికికి రూపు లేదు,
నీ తాకిడికి బలం లేదు,
నీ తపనకి శక్తి లేదు,
నీ తలపునకి నాంది లేదు,
పోల్చుకొనుటే సాధ్యం కాదు,
నువ్వు నిజం కానే కాదు,
నేనే నిజం నిజం !! అని.

కల్పితం చెప్పిందిలా ...

ఓ వాస్తవమా !!
ఊహే నా శక్తి,
భ్రమే నా ఉనికి,
వర్ణనే నా ఆకారం,
భావుకతే నా ఆధారం,
నీది ఏక రూపం,
నావి భిన్న కోణాలు, 
అందరూ నీ అంగిట్లో అలసి,
నా ముంగిట్లో సేద తీరతారు …
ఈ నాటి మేధస్సు ఓ నాటి కల్పితమే కదా,
నీవు నాతో మాట్లాడుతున్నది నా సాయంతోనే మిత్రమా ...
నా అవసరం నీక్కూడా అవసరమే ఎంతైనా... హ హ హ !!!

6 comments:

  1. Good one!! yes truth is that a person needs both!!:)

    ReplyDelete
    Replies
    1. "కొద్దిపాటి కల్పనలు మరిన్ని వాస్తవాలు వెరసి మన జీవితాలు"
      అని చెప్పే ప్రయత్నం ఇది ... థ్యాంక్స్

      Delete
  2. Wow Amazing. చాలా బాగుంది. 'నీవు నాతో మాట్లాడుతున్నది నా సాయంతోనే మిత్రమా ...' Nice pic too

    ReplyDelete
    Replies
    1. "కల్పిత రచన లొని వాస్తవ (తుంటరి) వాక్యాన్ని" బయటకి లాగి మరీ ఆస్వాదించినందుకు
      మరియూ అభినందించినందుకు ధన్యవాదాలు.

      ;-)

      Delete
  3. Anonymous3/14/2013

    chakkani chikkani kavitha

    ReplyDelete
    Replies
    1. chikkati chakkati kaadaa ??
      ;-)

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు