కవిత రచన : సాత్విక
అని అవహేళన ఎందుకులే ?
కవిత్వమా కాకరకాయ ?
అన్న ప్రశ్నకి సమాధానముగా,
పద్య, గేయ పద సంపుటి అంతరించి,
'తెలుగు' కనీసం వాడుక భాషగా సంచరించ
కూడా 'అనాధ' ఆగుతున్న ఈ తరుణములో,
నేనున్నాను,
నేనున్నాను,
ఆదుకొంటాను అణగారిపోనివ్వనని,
భాషాభిమానం చాచిన అభయ హస్తమే వచన కవిత్వ ఆకారము,
పుట్టించెను తెలుగు మీద సామాన్య మానవుడికీ మమకారము,
పాత తర భావావేశాన్ని సరికొత్తగా ఆవిష్కరించే ఒరవడికి శ్రీకారం,
'ఇది ఉద్భవించినది' -- తగ్గించడానికి తెలుగు తల్లి చేసే హాహాకారం,
నియమ నిభందనలు తెలియదని... అసలు లేనే లేవని అవహేళన ఆపవోయి,
అలంకార బంధాలు వదిలించుకొన్న 'స్వేచ్చే' దీని ఆయువుపట్టని గ్రహించవోయి,
ఈ తరహా కవిత్వానికి నవ సమాజమున ఓటుబ్యాంకు ఎక్కువోయి,
కవిత్వానికి, 'వచన రూపం' అందించిన శక్తి నీవు గ్రహించవోయి,
మారుతున్న కాలానికి అనుగుణముగా రూపాంతరం చెందెనోయి,
మనసున్న ప్రతి మనిషి మదిలోకి అలవోకగా చేరిపోయే శైలే దీనికున్నదోయి,
'అంతరార్ధ వివరణా..' వ్యయా-ప్రయాసలు అవసరం లేని సులువు దీని సోంతమొయి,
సరళమయిన పదాల అల్లిక తో కూడిన 'ప్రాసే' దీని అసలు బలం,
లోతయిన భావాలని ఇమిడ్చుకోగలిగినందుకు నీవు చేయి సలాం,
కవిత్వం మీద మనసున్న మనిషి ఆకలి తీర్చే అచ్చతెలుగు గళం,
చండ ప్రచండ చక్రవర్తులయిన ఉండి వుంటే అయ్యేవారు దీనికి గులాం,
వచన కవిత్వమా నీకివే నా వందనాలు,
తెలుగుని పది మందికీ చేర్చు,
అన్ని రూపాల విస్తరించ ప్రయత్నించు,
నిన్ను ప్రశ్నించిన వారికి తెలుగు'వాడి'ని చూపించి ప్రతిఘటించు...
Claps!!!!
ReplyDelete;-) ధన్యవాదములు !
Deleteప్రాసలని పట్టుకుని ప్రాకులాడే వాళ్ళని చూసినప్పుడల్లా మంచి ఫీల్ ని మిస్ అవుతున్నాం అనే భాన నాకు బలంగా ఉంటుంది. పాఠకుడి హృదయాన్ని తాకే కవిత్వం వచనం లో ఉంటె ఏమిటి అభ్యంతరం అన్నది నా ప్రశ్న. మీ అభిప్రాయం నాకు నచ్చింది వచనం లో వండర్ఫుల్ కవిత్వం వ్రాసే వాళ్ళు నాకు తెలుసు
ReplyDeleteమీ సూటి అయిన వాడి అయిన ప్రశ్న నాకు నచ్చింది గుడ్.
@వనజవనమాలి: స్వాగతం.
Deleteనాకు కూడా మీలాగే కొంచం బాధ అనిపించి అలా రాయాలనిపించి రాసేసాను. నిఖ్ఖచ్చిగా చెప్పాలంటే నాకు ఓనమాలు కూడా రావు ఈ రంగములో, కానీ ఏదో బ్లాగ్ లో ఎవరో వచన కవిత్వాన్ని అవహేళన చేసారు అందుకు కొంచం చివుక్కుమనిపించి ఇలా చిన్న బాధ తో కూడిన ఫీల్ నన్ను ఇలా రాయించింది.
నా భావం గ్రహించినందుకు ధన్యవాదములు !!
chakkani peru anta kante chakkani nee vachana kavitha
ReplyDeleteThanks for the encouragement.
Deleteనాకు మాత్రం ఏది ఏమైనా
ReplyDeleteదేనిరుచి, ప్రత్యేకత దాందే
కాకరకాయ కాకరకాయే
వంకాయ వంకాయే...నో మిక్స్డ్ కర్రీ :-)
అవునండి నేను కూడా మీ అభిప్రాయాన్నే సమర్దిస్తాను. కాకపోతే నాకు కాకరకాయ ఇష్టం అని వంకాయ బాగాలేదు అని మటుకు అనను అదే చెప్పదలుచుకున్నాను.
Deleteనాకు కాకరకాయ curry చేయడం రాదు. ఇంకో విషయం ఏమిటంటే వంకాయ curry కూడా చేయడం రాదు,
కాకపోతే ప్రయత్నం చేసే ఆలోచన మటుకు వున్నదంతే .... ;-)
మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదములు !!
ReplyDeleteవచన కవిత్వం చనిపోతున్న తెలుగు ని బతికిస్తోంది.
ఎవరన్నారు వచన కవిత్వాన్ని గురించి అన్నేసి మాటలు ! ఆయ్ !
చెప్పండి, కామెంటు కత్తి తో 'పొడి' చేస్తా !
చీర్స్
జిలేబి.
జిలేబి గారికి స్వాగతము.
Deletecontent చూస్తే జిలేబి లాగానే ఉన్నది, కాకపోతే వేలిముద్ర లేనందున ఇదేమన్న కల్తీ జిలేబినా అన్న సంశయం ....
anyway ధన్యవాదములు మీ కామెంట్ కత్తి పోటుకి ...