March 5, 2013

మనస్సు విప్పలేను ! కవిత రాయలేను !!



కవిత రచన : సాత్విక 
ప్రియురాలు కోరింది తన పై ఒక కవిత రాయమని,
నా కవితా భావాలు తెరతీస్తాయి ఎన్నో అపార్ధాలు,

ఆమే ఆలోచనేనా గుండెల్లో రేకెత్తిస్తుంది పెను తుఫా'నే',
ఆమే తాకిడేనా మది లోతుల్లో రగిల్చేను ఓ అలజ'డే' ,
ఆమె వలపే, నా లో నిలుపును తన తలపుల సంఘర్ష'నే',
ఆమే సహచర్యమే, నాకు మత్తెక్కించే ఒక మాదక ద్రవ్య'మే',
ఎలా చెప్పను ఈ వింత భావనకాకూడదివి కవితకు ప్రేరణ,

ప్రియురాలి చిరునవ్వే సిరులోలికించే ఆభరణం అనినచొ,
నే పుత్తడి బహుమతిని నీరువదిన్చునని తను బ్రమపడునేమో,
జవరాలి ముంగురులు వసంతాన ఊగే గాలి తెమ్మరులనినచో,
వసంతాన విహారయాత్రలు వారింతునని చింతపడునేమో,

తనకోసం నా హృదయంలో ప్రేమ మందిరము నిర్మించాననిచో,
రహదారి లేని నిర్మాణము తనకేల అని మిన్నకుండునెమో,
తన అందానికి సాటి రాదు ముల్లోకానా మరో అతివ అనినచొ,
ఏడేడు భువనాలు ఏల మరిస్తివని తను కలతచెందునేమో ,

ఇంకొన్ని భావాలను ఈ రచనలో మరిన్ని పంక్తులుగా జత చేసిన,
తన మనోభావం దెబ్బ తినిందని నా ప్రేమకు విడాకులు తుంచునేమో,
కవిత ఎలా రాయ గలను ఆమె కోరికేలా తీర్చ గలను 
అందులకేనే మనస్సు విప్పలేను ఈ కవిత రాయలేను...

8 comments:

  1. Replies
    1. ఏమండి చెప్పాలంటే మీ 'బాగుంది' నిజంగానా?
      ధన్యవాదములు ;-)

      Delete
  2. హాయ్,


    " మనసంటూ ఉంటే మార్గమదే కనపడ్తుంది అంటం అంటే ఈ కవితే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ."
    వ్రాయాలని ఉండాలే గాని , ఎలాగైనా వ్రాయవచ్చు అని వెల్లడి చేశావు.

    బాగుంది అని మళ్ళీ ప్రత్యేకంగా వ్రాయాల్సిన పని లేదంకుంటున్నాను .

    శర్మ జీ ఎస్

    ReplyDelete
    Replies
    1. మార్గం దొరికితే మనసు కూడా పుడుతుంది అప్పుడప్పుడూ...
      అందుకే ఇలా ...
      ధన్యవాదములు ఇలా ...

      Delete
  3. Mothaniki Raayalenu antune raasessav!!:)

    ReplyDelete
    Replies
    1. రాయలేను రాయలేను అన్న చిన్నపటినుంచి రాయిన్చారుగా పరీక్షలు అందరూ ...
      అలాగే తను కూడా రాయిన్చేసింది నా చేత రాయనన్నా వినకుండా ..... అదే నా మనస్సు ....
      హ హ హ హ .....

      Delete
  4. మనసులో ఇష్టాన్నీ తెలిపితే మురిసిపోతుందెమో మీ చెలి.
    చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మనలొ మనమాట మురిసిపొయిందిలెండి ....హ హ హ
      మీ ప్రొత్సాహనికి ధన్యవాదములు....

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు