March 19, 2013

టిక్కెట్ లేని మ్యూజియం ....


కవిత రచన : సాత్విక 
అంద చందాలు ఆ అమ్మాయి ఇంటిపేరు కాగా,
'నేను ఈ ముద్దుగుమ్మను పొందకుండు'నా అని అతను,

చదువు సంధ్యలు ఆతని వినయ విధేయతలవ్వగా,
'జాప్యమేల జతగాడా జంటగా చేరు నా చెంత' అని ఆ అమ్మాయి,

వారిరువురి ఎదురుచూపులకి  చిన్నబోయె కదా,
తొలకరి వానకై వేచియున్న పచ్చిక బయలు సైతము,

'వివాహము నిశ్చయంబ'న్న శుభ ఘడియల ముంగిట వారిరువురూ,
'చిత్రము చూసోద్దాము రా రాకుమారా' అన్న తన ప్రేయసి కోర్కెను,

కాదనలేని 'బలహీన మనస్సు పైన బలీయమయిన విధి' కోరలు చాచేను,
ముచ్చటగున్న జంట పై కన్ను పడె ఆ రాహు కేతు గణాల,

చిత్రము సమాప్తి అనుకున్నదా జంట కాని పరిసమాప్తమని తెలియదు వారికి,
గూటికి చేరేందుకు అనువయిన మార్గము కానరాలేదు వారిరువురికి,

చేరువలో నడిరేయి సమీపించ, నలుగురూ కనుమరుగవుతుండగా,
నగర శివారు కాబోలు, ఆ జంట ఉరకలేసే వడి వడిగా - ఆ పై వేగముగా,

'మనువాడే-చెలికాడే' చెంతనుండ తనకేమిటన్న చిన్న తెగువ,
తేలియాడెను ఆ క్షణం ఆ బాల కళ్ళలోన తెరచాటు భరోసా,

'దానవలోకం టు యమలోకం వయా భూలోకం' అన్న అక్షరాలు కానరాక,
'చెయ్యెత్తు, బస్సెక్కు' అన్న నినాదాన్ని గ్రహపాటుగా అనుసరించాక,  

ఆ క్షణం ఆ జంట చూడాల్సి వచ్చింది,
మానవత్వం మాటున దాగిన దానవ రూపం,
కలి ఆవహించిన నిర్దాక్షణ్యపు నర రూపం,

బస్సు లోన బేల, తనని విడువమని వేడుకొన్నది,
వేడుక లోన గొర్రె, నన్ను కనికరించమన్నది,
వేడుక పూర్తాయనే గొర్రె  కానరాకపోయేనే, 

ప్రేమించిన ప్రియురాలు కబంధ హస్తాల పాలు, 
నిస్సహాయ ప్రియుడి ఆవేదన నిరాశా నిస్పృహలపాలు,
వెరసి కడకు ఆతని ప్రార్ధనా విన్నపాలు, ఇలా..

నిర్దాక్షణ్యపు  భావమా నువ్వయినా నీరు గారిపో,
సహయనిరాకరణమా నువ్వయినా సమ్మె విరమించుకో,
కదులుతున్న కాలమానమా నువ్వయినా స్తంభించిపో,
నా కంఠములొని  ప్రాణమా నీవయినా నన్ను వదలిపో,

ఏ ఒక్క ప్రార్ధన ఫలించని ఆ క్షణం,
ఆ బాల అయ్యెను కదా అబల,
జరిగిపోయెను కదా ఘోర దారుణం,
రహదారి పైకి విసిరి వేయబడ్డ ఆ ప్రాణ మానం,

విల విల లాడెను ఆ ప్రియుడి మనస్సు,
గుండెలు మండగా, గుండెలవిసేలా రోదించే,    
ప్రశ్నించేను కనిపించిన ప్రతివారినీ ఇలా……
"ఎందుకు అంతరించలేదు ఈ జగతి, 
ఏమి మిగిలి వుంది ఇంకా సాధించాల్సిన ప్రగతి "



యావత్ దేశము గర్జించినా ఏమున్నది ప్రయోజనం,
రోజూ ఈ ఘోరం జరుగుతున్నది ప్రతి నూరు యోజనం,
అయిపొయిందీ భువి,  కలి అవశేషాలు మోసే మ్యూజియం...(నో టిక్కెట్ -- ఫ్రీ ఎంట్రీ )

8 comments:

  1. Very Very touching!! Still not able to forget the incident:) not only that, as u said these type of incidents are become very much routine, big shame for all Indians.......

    ReplyDelete
    Replies
    1. its true everywhere in the globe...

      Thanks for the response...

      Delete
  2. very touching as vidya said ....

    ReplyDelete
    Replies
    1. I wish it should touch those who are participating in the crime... then only we can get out of this non-sense...

      Thanks for the response.

      Delete
  3. మనసుని హత్తుకుంది.....బాగారాసారండి.

    ReplyDelete
    Replies
    1. హాయ్ పద్మార్పితగారు ,

      భాధ ఎవరిదయినా మనస్సుంటే ఖచ్చితముగా టచ్ చేస్తుంది....ఒక sad smile ;-(
      ధన్యవాదములు మీ ప్రోత్సాహానికి ...

      Delete
  4. మీ సమోసాలు కరకర లాడుతున్నాయి..కొండొకచో..కొర కొర (కొంతమందిమీద) చూస్తున్నాయి..మొత్తానికి వేడి వేడి గా ఉన్నాయి.. యెల్లప్పుదూ వేడి తగ్గ కూడదని కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. హనుమచ్ఛాస్త్రి గారికి సుస్వాగతం!! మా సమోసాల బండి కి !

      సమోసాల తీరే అంత కదండీ !!
      మీరిలా ప్రోత్సహించండి మా సమోసాల వ్యాపారం వేడి వేడి గా చేసేద్దము....హ హ హ ....

      మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు ....

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు