March 28, 2013

ఈ ప్రక్కకి చూడొద్దు ...


కవిత రచన : సాత్విక

అసలే శాస్త్రమూ చదువలేదు
నేనేవ్వరితో వాదించుట లేదు,
వారినెవ్వరినీ కాదనుటలేదు 
అయిననూ,  నాకు అనిపించేను ఇలా
'సన్యాసమంటే స్పందన లేకుండుటే ' కదా !

కాషాయం ఏరి కోరి కట్టుకొనుట,
రంగు మీద వారి మనస్సు లగ్నమగుటే,

నియమాలన్నీ వల్లించుట పాటించుట,
తెలిపెనులే శ్రద్ధ, భక్తిలకి వారు వశమగుటే,

నియమ నిబంధనలలో ఇరికించుకోనుట,
సన్యాసిగా మార్పునాసించిన ప్రక్రియలోని బాగము మాత్రమే,

ధర్మ-అధర్మ ప్రభోదాల వారియొక్క ఆధ్యాత్మిక చింతన,
ఖచ్చితముగా నిలుపును కొంతమేర 'సాధువు'ల చెంతన,

సన్యాసము అనునది కేవలం ఒక మానసిక భావజాలము,
కావాలనుకున్నంత మాత్రాన అందరమూ పొందజాలము,

పౌడరు,క్రీములు అందముగా అద్దుకునే గురువులు ఒక పక్క,
కోపగించుకొని కన్నెర్ర చేసే సాములోరులు అందరికెరుక,
మైమరచి తరచి తరచి ఆనక ఊసులడిగేను తస్స చెక్క,
ఆణువణువూ పరీక్షించు అగుపించేను అసలు చందము ఎంచక్కా,

అందుకే, కాషాయ వస్త్రదారులందరూ సన్యాసులు కారులే,
అందులోన అధిక శాతం సంసారులేకొంతమేర సాదువులే !

కాషాయం అనినచొ వెలవెల పోవుటకు సూచనగా నీవు పరిగణించు,
మేనిన అలంకరించ కాదది, నిర్లిప్తత నిండిన మనస్సును అది ఆవహించు !

సమాజములోని అవినీతి, అన్యాయం, దోపిడీతనం ఒకింత,
ప్రభుత్వాల పనితీరువేటిమీదా స్పందనే లేకున్నారు ప్రజలంతా,
సమాజశ్రేయస్సు పట్టని సమూహ సన్యాసులయ్యరా వీరంతా ?

అందుకే అస్సలు ఈ ప్రక్కకి చూడొద్దు,
కనిపిస్తారు సమాజములోని ఆధునిక సన్నాసులు,
మఱియూ కాషాయం ధరించని సన్యాసులే అధిక మొత్తముగా,
కాషాయాన్ని విషకషాయముగా ఉపయోగించువారే ఏకముగా !!

10 comments:

  1. నిజమే!
    ఒక చట్రం లో మనల్ని మనం బంధించుకుని,నేను అనే తప్ప,మనము అని అలోచించటానికి కూడా ఇష్టపడని,సమాజశ్రేయస్సు పట్టని సమూహ సన్యాసులమే కదా మనమంతా! చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. సారాన్ని పరిపూర్ణముగా ఒక్క వాక్యములో కుదించేసినారు గందా !! అందుకోండి నా నెనర్లు !!

      Delete
  2. Anonymous3/28/2013

    'సన్యాసమంటే స్పందన లేకుండుటే ' కదా !

    సంన్యాసానికి కొత్త నిర్వచనమా :)

    ReplyDelete
    Replies
    1. "(ఐహిక విషయాలు) త్యజించి ప్రతిస్పందనకి అతీతమగు స్థితికి చేరుకొనుట "
      అన్న ఉద్దేశ్యము లోని క్రియ ని ఉద్దేశించినదే నా భావన..
      పొరపాటు జరిగి ఉంటే పెద్ద మనస్సుతో సరి చేయగలరు ;-)

      ధన్యవాదములు !!

      Delete

  3. సన్న్యాసుల విన్యాసాలు చక్కగా తెలపటంలో సఫలీకృతుడవయ్యావు.
    చాలావరకు సన్యాసులు సన్నాసులే అంటం చాలా బగుంది.

    ReplyDelete
    Replies
    1. మరీ మొహం మీద చెప్పలేము కదండీ, అందుకే ఇన్ని తిప్పలు పడి
      తిప్పి తిప్పి చెప్పవలసి వచ్చింది !!

      Delete
  4. దిగితేనే కదండి లోతెంతో తెలిసేది....చూడొద్దంటే ఎలా:-)

    ReplyDelete
    Replies
    1. ముగ్గురు మొనగాళ్ళు పాత తరం హీరోయిజం, ముగ్గురు వెధవలు (3 idiots) కొత్త తరం కదండీ...
      ఏదీ స్ట్రెయిట్ గా చెబితే చూడరు అందుకని
      చూడద్దు అంటే చూస్తారేమో అని ఇలా ట్రై చేశా ;-)
      ధన్యవాదములు !!

      Delete
  5. u r right upto some extent!! good one!!

    ReplyDelete
    Replies
    1. why not its right at full extent ?

      I want the answer right now !! that's it !!
      U know Nellore peddareddy ?

      ;-)

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు